Viral News | ఏం మాయ చేసావే.. ఒక్క రోజులోనే కోటి మంది ఫాలోవర్లను సంపాదించిన చైనా బ్యూటీ!

Viral News | చైనాకు చెందిన ఓ బ్యూటీ సంచలనం సృష్టించింది. సోషల్‌మీడియాలో అకౌంట్ తెరిచిన 24 గంటల్లోనే 10 మిలియన్ ఫాలోవర్లను సంపాదించి కొత్త రికార్డు సెట్ చేసింది. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Viral News | చైనాకు చెందిన ఓ బ్యూటీ సంచలనం సృష్టించింది. సోషల్‌మీడియాలో అకౌంట్ తెరిచిన 24 గంటల్లోనే 10 మిలియన్ ఫాలోవర్లను సంపాదించి కొత్త రికార్డు సెట్ చేసింది. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

చైనాకు చెందిన జియాంగ్ చెంగ్‌లాన్ ప్రముఖ బ్యూటీ మేకప్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఒకప్పుడు ఆమె చెంగ్షియన్ (@chengshian) పేరుతో ఆమె అత్యంత ప్రాచుర్యం పొందింది. ఆ సమయంలో పలు సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో కలిపి సుమారు మూడు కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించింది. అయితే ఏమైందో ఏమో కానీ మూడేళ్ల క్రితం అకస్మా్త్తుగా సోషల్‌మీడియాకు దూరమైంది. 2023 మే నెల నుంచి వీడియోలు పెట్టడం మానేసింది. దీంతో అనేక సందేహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సుదీర్ఘ విరామం తర్వాత ఆమె మళ్లీ సోషల్‌మీడియాకు రీఎంట్రీ ఇచ్చింది. జియాంగ్ చెంగ్‌లాన్ (@Jiang_Chenglan) అని తన పేరుతోనే కొత్త అకౌంట్‌ను ఓపెన్ చేసింది. సోషల్‌మీడియాలో ఆమె కొత్త ఖాతా చూడగానే ఆమె ఫాలోవర్లు ఒక్కసారిగా ఆనందంతో ఉప్పొంగిపోయారు. మళ్లీ ఆమెను ఫాలో కొట్టడం మొదలుపెట్టారు. అలా కేవలం 24 గంటల్లోనే దాదాపు కోటి మంది ఫాలోవర్లను సంపాదించి చైనా డిజిటల్ వరల్డ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మే 13వ తేదీన ఖాతా తెరిచిన చెంగ్‌లాన్.. తొలుత ఒక వీడియోను పోస్టు చేసింది. మూడేళ్ల కిందట అకస్మా్త్తుగా సోషల్‌మీడియా నుంచి ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో కారణాన్ని వెల్లడించింది. తన పాత మేనేజ్‌మెంట్‌తో నెలకొన్న వివాదం కారణంగానే సోషల్‌మీడియా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తన పాత ఆన్‌లైన్ నేమ్ చెంగ్షియన్ సంస్థ పేరు మీద ట్రేడ్‌మార్క్‌గా నమోదైంది అని తెలిపారు. ఇప్పుడు ఆ పేరుతో నడుస్తున్న సోషల్‌మీడియా ఖాతాలు, ఆన్‌లైన్‌ షాపులతో తనకు సంబంధం లేదని స్పష్టం చేసింది. తన మీద ఉన్న నమ్మకంతో చెంగ్షియన్ బ్రాండ్ ఉత్పత్తులు కొనవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది.

ఇకపై తన కొత్త ద్వారా తన ఫాలోవర్లకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెంగ్‌లాన్ తెలిపింది. ఇప్పటి నుంచి మేకప్ పాఠాలు, బ్యూటీ టిప్స్‌తో పాటు పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై తన ఆలోచనలను కూడా పంచుకుంటానని చెప్పింది. దాని తర్వాత రోజు డైలీ మేకప్ ప్రాసెస్‌పై ఒక ట్యుటోరియల్‌ను విడుదల చేసింది. ఈ వీడియోకు 44 లక్షలకు పైగానే లైక్‌లు రావడం గమనార్హం. కూల్‌గా, సింపుల్‌గా చెంగ్‌లాన్ చెప్పే మేకప్ చిట్కాలకు 1990s, జెన్‌జీకి చెందిన యువతులకు విశేష ఆదరణ ఉంది. తక్కువ ధరలో మంచి నాణ్యత కలిగిన ఉత్పత్తులను ప్రోత్సహించడం, వివాదాలకు దూరంగా ఉండటం వల్ల ఆమెపై అప్పట్లో జనాల్లో విశ్వసనీయత పెరిగింది. ఆమె రీఎంట్రీకి వచ్చిన క్రేజ్‌తో దేశీయ, అంతర్జాతీయ కాస్మెటిక్ బ్రాండ్లు కూడా దీన్ని క్యాష్ చేసుకునేందుకు సిద్ధమయ్యాయి.

Read More:

శోభనం రాత్రి భార్యను మేకప్ లేకుండా చూసి కంగుతిన్న కొత్త పెళ్లి కొడుకు..!

ఇది కదా అదృష్టమంటే.. పాత ప్యాంటులో దొరికిన లాటరీ టికెట్‌కు కోట్ల రూపాయల జాక్‌పాట్!

Latest News