Viral News | కెనడాలో చెట్ల కొమ్మలను కొడితే గంటకు రూ.49 వేలు.. వైరల్‌గా మారిన ఇండియన్ వీడియో

కెనడాలో బ్లూ కాలర్ ఉద్యోగాలకు ఎంత ఆదాయం వస్తుందో చెప్పే వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడ ఇంటి ముందు పెరిగిన చెట్ల కొమ్మలను కొట్టేందుకు గంటకు రూ.49వేల వరకు తీసుకుంటారని విశాల్ అనే యువకుడు తన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా.. అది పెద్ద చర్చకు దారితీసింది.

Viral News | కెనడాలో చెట్ల కొమ్మలను కొడితే గంటకు రూ.49 వేలు.. వైరల్‌గా మారిన ఇండియన్ వీడియో

Viral News | కెనడాలో బ్లూ కాలర్ ఉద్యోగాలకు ఎంత ఆదాయం వస్తుందో చెప్పే వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడ ఇంటి ముందు పెరిగిన చెట్ల కొమ్మలను కొట్టేందుకు గంటకు రూ.49వేల వరకు తీసుకుంటారని విశాల్ అనే యువకుడు తన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా.. అది పెద్ద చర్చకు దారితీసింది.

విశాల్ ఆ వీడియోలో మాట్లాడుతూ.. తను ఉంటున్న ఇంటి వద్ద పెరిగిపోయిన చెట్ల కొమ్మలను తొలగించేందుకు ఒక ప్రొఫెషనల్ ట్రీ కట్టర్‌ను పిలిచానని.. కేవలం గంటపాటు చేసిన పనికి అతనికి 700 ( భారత కరెన్సీలో సుమారు రూ.49వేలు) కెనడియన్ డాలర్లు చెల్లించాల్సి వచ్చిందని తెలిపాడు. కెనడాలో ఇలాంటి నైపుణ్యంతో కూడిన పనులకు భారీగా డిమాండ్ ఉంటుందని చెప్పాడు. చెట్ల కొమ్మలు కత్తిరించే పని బయటకు సాధారణంగా కనిపించినప్పటికీ.. ఇందులో ఎంతో సాంకేతిక పరిజ్ఞానం ఉంటుందని పేర్కొన్నాడు. దీనికి అనుభవంతో పాటు ఖరీదైన యంత్ర పరికరాలు అవసరమవుతాయని అన్నాడు. పైగా ఈ పని చాలా ప్రమాదకరమైనదని.. చిన్న పొరపాటు జరిగినా గాయపడాల్సి వస్తుందని.. ఒక్కోసారి ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు. అందుకే అతనికి 700 కెనడియన్ డాలర్లు చెల్లించాల్సి వచ్చిందని వివరించాడు.

అయితే తాను చెల్లించిన మొత్తం ఆ కార్మికుడి చార్జీ కాదని విశాల్ తెలిపాడు అందులో చెట్లను కొట్టడానికి వాడిన ఇంధన వ్యయం, ట్రక్కుల నిర్వహణ, పరికరాల మెయింటెనెన్స్, కమర్షియల్ ఇన్సూరెన్స్, లైసెన్సులు, పన్నులు వంటి అనేక ఖర్చులు ఉంటాయని వివరించాడు. ఇక అక్కడి కార్మికులు సమ్మర్‌లో చెట్లను కొట్టే పనిలో బిజీగా ఉంటే.. చలికాలంలో ఇళ్ల ముందు, రోడ్లపై పడిన మంచును తొలగించే పనులతో ఏడాది పొడవునా ఆదాయం సంపాదిస్తున్నారని చెప్పాడు. విశాల్ పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

 


ఈ వైరల్ వీడియోపై పలువురు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కెనడాలో డిగ్రీ కంటే కూడా స్కిల్ ఉంటే ఎక్కువగా సంపాదించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్లంబింగ్, ఎలక్ట్రిక్ వర్క్, ల్యాండ్ స్కేపింగ్, మంచు తొలగింపు, చెట్ల తొలగింపు వంటి బ్లూ కాలర్ ఉద్యోగాలకు అభివృద్ధి చెందిన దేశాల్లో ఎంతో గౌరవం, ఆదాయం ఉంటుందని మరికొందరు కామెంట్ చేశారు. మరికొందరు చెట్లను కొట్టే వ్యక్తి సంపాదనపై కామెంట్లు చేశారు. గంటకు 700 డాలర్లు తీసుకున్నాడంటే.. అదంతా అతని జేబులోకే వెళ్లదని.. పరికరాల లీజు, ఇంధనం, సిబ్బంది ఖర్చులు, బీమా, పన్నులు ఉంటాయని చెప్పారు. అవన్నీ తీసేస్తే అసలు లాభం 10 నుంచి 30 శాతం మాత్రమే ఉండొచ్చని వివరించారు. మరికొందరు ఈ పనిలో ఉన్న రిస్క్‌ గురించి ప్రస్తావించారు. ఈ పని చాలా ప్రమాదకరమైనదని.. ఒక చిన్న కొమ్మ పడినా ఎంతో ముప్పు అని అన్నారు. భారత్‌లోనూ వైట్ కాలర్ ఉద్యోగాలతో పాటు.. ఇలాంటి స్కిల్డ్ వర్క్‌కు విలువ పెరగాలని అన్నారు.

Read More:

పాక్ ఉగ్రవాది బట్టతల కష్టాలు.. టెర్రర్ మిషన్ పక్కనబెట్టి.. హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌‌పై ఫోకస్..!

Pakistan Terrorist | పాక్ ఉగ్రవాది బట్టతల కష్టాలు.. టెర్రర్ మిషన్ పక్కనబెట్టి.. హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌‌పై ఫోకస్..!