Viral Video | సాధారణగా టీచర్ మందలిస్తే పిల్లలు ఏం చేస్తారు? భయపడిపోతారు.. లేదా సైలెంట్‌గా ఉండిపోతారు. కానీ ఓ చిన్నోడు ఏ మాత్రం బెదరకపోగా.. ఏకంగా టీచర్‌కే వార్నింగ్ ఇచ్చాడు. కానీ అమాయకంగా ఆ పిల్లాడు ఇచ్చిన వార్నింగ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో పిల్లాడి సీరియస్ లుక్స్ చూసి అంతా నవ్వుకుంటున్నారు.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. పసుపు పచ్చ రంగు స్కూల్ యూనిఫామ్ ధరించిన ఓ బాలుడు క్లాస్‌లో కూర్చొని ఉండగా.. అతని దగ్గరకు వచ్చిన ఓ టీచర్ చదువుపై ఫోకస్ చేయాలని సూచించింది. చదువుకోమని టీచర్ చెప్పగానే ఆ పిల్లాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అంత చిన్న వయసులోనే చదువుపై ఎంత విరక్తి వచ్చిందో ఏమో కానీ టీచర్‌పై శివాలెత్తినట్లు ఊగిపోయాడు. నేను అస్సలు చదువుకోను.. ఇలాగే అడుగుతే.. మీ స్కూల్ గోడలను పగులగొడతా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఖబడ్దార్ అన్నట్లుగా చేతితో సైగలు చేస్తూనే హెచ్చరించాడు.
అయితే ఆ పిల్లాడు ఇచ్చిన వార్నింగ్ చూస్తుంటే ఎవరికీ కోపం వచ్చేలా లేదు. ఆ బాలుడి మాటల్లో కోపం కంటే అమాయకత్వం, అల్లరి స్వభావం ఎక్కువగా కనిపించింది. అతని ముఖ కవళికలు, చెప్పిన విధానం టీచర్‌తో పాటు క్లాస్‌లో ఉన్న విద్యార్థులు ఎవరూ నవ్వు ఆపుకోలేకపోయారు. దీంతో ఆ టీచర్ పిల్లాడి మాటలను ఎంతో ఓపికగా వింటూ వీడియో రికార్డు చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియో చూసిన నెటిజన్లు కూడా విపరీతంగా నవ్వుకుంటున్నారు. ఇది నిజంగా చైల్డ్‌హుడ్ డ్రామా పీక్ అని, పిల్లల అమాయక స్పందనలే ఇలా నవ్వులు పంచుతుంటాయని కామెంట్లు పెడుతున్నారు. సావేజ్ రిప్లై అయినప్పటికీ ఎంతో క్యూట్‌గా ఉందని మరికొందరు అంటున్నారు.
Read More:
ఉద్యోగం ఇవ్వలేదని.. కంపెనీలు సర్వనాశనం కావాలని తాంత్రిక పూజలు!
ఈ గుడికి వెళ్లొస్తే బట్టతల మీద కూడా జుట్టు వస్తుందట.. జపాన్‌లో వైరల్‌గా మారిన మికామి ఆలయం
