Viral Video | భారతీయ వివాహాల్లో సందడి మామూలుగా ఉండదు. పెళ్లి సమయంలో హడావుడి, చివరి నిమిషంలో ఏదైనా మరిచిపోతే ఉంటే గందరగోళం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అందరూ ఏదో ఓ పనిలో ఉంటారు.. అప్పుడు ఎవర్ని బయటకు పంపాలో కూడా అర్థం కాదు.. కానీ ఓ పెళ్లి వేడుకలో ఇలాంటి సందర్భమే ఎదురైనప్పుడు జరిగిన ఘటన తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే! ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల ఓ పెళ్లి జరుగుతుండగా హోమంలోకి సరిపడా సమిధలు (కట్టెలు) లేవని పంతులు గుర్తించాడు. ఇదే విషయం పెళ్లి వారికి చెప్పాడు. అప్పటికే పెళ్లి తంతు మొదలవ్వడంతో అంత ఫాస్ట్‌గా బయటకు వెళ్లి కట్టెలు తీసుకురావడం కుదరదని అంతా టెన్షన్ పడిపోయారు. ఇంతలోనే పెళ్లిలో ఒకరు ఠక్కున స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ పెట్టాడు. ఇంకేముందు ఆర్డర్ పెట్టిన 10 నిమిషాలకే స్విగ్గీ డెలివరీ బాయ్ కట్టెలు తీసుకుని పెళ్లి మండపంలో ప్రత్యక్షమయ్యాడు. స్టేజి మీద ఉన్న సమిధలు అయిపోయేలోపే డెలివరీబాయ్ అందజేయడంతో పెళ్లి సాఫీగా సాగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను సుప్రియా మిట్టపల్లి అనే యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇది కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. స్విగ్గీ కూడా దీనిపై సరదాగా స్పందించింది. ఔర్ కుచ్ చాహియే అంటూ పెట్టిన రిప్లై కూడా ఇప్పుడు వైరల్ అయ్యింది.
ఈ ఘటనపై నెటిజన్లు ఫన్నీగా జోకులు వేస్తున్నారు. రేపు పొద్దున పెళ్లి కొడుక్కి ప్యాంట్ బెల్ట్ లేకపోయినా.. పెళ్లి కూతురికి మ్యాచింగ్ గాజులు మరిచిపోయినా స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవచ్చని కామెంట్లు పెడుతున్నారు.
Read More:
రామసేతు మార్గంలో శ్రీలంక నుంచి భారత్‌కు ఈదుకుంటూ వచ్చిన బెంగళూరు ఐటీ దంపతులు
