కోహ్లీ కూతురిని అత్యాచారం పేరుతో బెదిరించిన వ్య‌క్తిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

విధాత‌: విరాట్ కోహ్లీపై బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని ముంబై పోలీసులు బుధవారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. విషయంలోకి వెళితే.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా పాకిస్తాన్‌తో జ‌రిగిన‌ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అనంతరం.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని టార్గెట్‌ చేస్తూ.. కోహ్లి కూతురు వామికాను అత్యాచారం పేరుతో సోషల్‌ మీడియాలో కొందరు దుండగులు అసభ్యకర పోస్టులు చేశారు. తాజాగా కోహ్లి కూతుర్ని అత్యాచారం పేరుతో బెదిరింపులకు పాల్పడ్డ వారిలో హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల రామ్‌నగేష్‌ […]

కోహ్లీ కూతురిని అత్యాచారం పేరుతో బెదిరించిన వ్య‌క్తిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

విధాత‌: విరాట్ కోహ్లీపై బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని ముంబై పోలీసులు బుధవారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. విషయంలోకి వెళితే.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా పాకిస్తాన్‌తో జ‌రిగిన‌ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అనంతరం.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని టార్గెట్‌ చేస్తూ.. కోహ్లి కూతురు వామికాను అత్యాచారం పేరుతో సోషల్‌ మీడియాలో కొందరు దుండగులు అసభ్యకర పోస్టులు చేశారు.

తాజాగా కోహ్లి కూతుర్ని అత్యాచారం పేరుతో బెదిరింపులకు పాల్పడ్డ వారిలో హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల రామ్‌నగేష్‌ ఉన్నట్లు సైబర్‌ క్రైమ్‌ గుర్తించింది. ఈ మేరకు బుధవారం ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా పాక్‌తో మ్యాచ్‌ ఓడిన తర్వాత నగేష్‌ సోషల్‌ మీడియాలో కోహ్లి కూతురు గురించి అసభ్యకర మెసేజ్‌లు పెట్టినట్లు తేలింది. అయితే నగేష్‌ హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.