వశిష్ట లైన్‌లో రజనీకాంత్‌, బాలకృష్ణ.. బింబిసార2 సాధ్యమేనా?

విధాత: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రెండు దశాబ్దాలు పూర్తి చేశాడు. కానీ స్టార్‌ హీరో స్థాయికి చేరుకోలేక పోయాడు. తన కేరీర్‌లో అతనొక్కడే, 118, హరే రామ్, పటాస్ వంటి విజయాలు ఉన్నాయి. తాజాగా ఆయన నటించిన బింబిసార చిత్రం అతిపెద్ద హిట్టుగా నిలిచింది. ఈ చిత్రం ఏకంగా 50 కోట్లు వసూలు చేసి కళ్యాణ్ రామ్‌కి స్టార్ ఇమేజ్‌ని తీసుకుని వచ్చింది. ఈ చిత్రానికి వశిష్ట మల్లిడి దర్శకుడు. వశిష్టకు ఇది మొదటి చిత్రమైనప్పటికీ […]

వశిష్ట లైన్‌లో రజనీకాంత్‌, బాలకృష్ణ.. బింబిసార2 సాధ్యమేనా?

విధాత: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రెండు దశాబ్దాలు పూర్తి చేశాడు. కానీ స్టార్‌ హీరో స్థాయికి చేరుకోలేక పోయాడు. తన కేరీర్‌లో అతనొక్కడే, 118, హరే రామ్, పటాస్ వంటి విజయాలు ఉన్నాయి. తాజాగా ఆయన నటించిన బింబిసార చిత్రం అతిపెద్ద హిట్టుగా నిలిచింది. ఈ చిత్రం ఏకంగా 50 కోట్లు వసూలు చేసి కళ్యాణ్ రామ్‌కి స్టార్ ఇమేజ్‌ని తీసుకుని వచ్చింది. ఈ చిత్రానికి వశిష్ట మల్లిడి దర్శకుడు.

వశిష్టకు ఇది మొదటి చిత్రమైనప్పటికీ అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమాలో రెండు విభిన్నమైన కాలాల మధ్య కలయికని అత్యద్భుతంగా తెరకెక్కించాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో బింబిసారకు సీక్వెల్ ఉంటుంద‌ని త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని ద‌ర్శ‌కుడు స్పష్టం చేశాడు.

అయితే వశిష్టతో వ‌రుస చిత్రాలు చేయ‌డానికి బ‌డా నిర్మాత‌లు క్యూ కడుతున్నారు. పలువురు స్టార్ హీరోలతోనూ కమిట్ అయ్యారు. గీతా ఆర్ట్స్‌లో కూడా ఓ ప్రాజెక్ట్ చేయ‌డానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్‌తో మరో సినిమా చేయడానికి క‌మిట్ అయ్యాడు.

అదేవిధంగా ఇటీవల రజనీకాంత్ కూడా కథ వినిపించగా అది హోల్డ్‌లో ఉన్నట్లు సమాచారం. అంతేగాక బాలయ్యతో హిస్టారికల్ ఫిక్షన్ కలాంశంతో ఛంఘీజ్ ఖాన్ చేసే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఒకవేళ బాల‌య్య‌తో చంఘీజ్ ఖాన్ కాక‌పోయినా మ‌రో చిత్రం చేసే అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అయితే బాల‌య్య సొంత బేన‌ర్‌లో ఆయ‌న కుమార్తె నిర్మాత‌గా ఈ చిత్రం ఉంటుందని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇలా వరుస ప్రాజెక్టులు చేతిలో ఉంచుకుని బింబిసార 2 ఇదే ఏడాది ఎలా చేస్తాడనే అనుమానం అందరికీ వస్తుంది. ఒకవేళ వశిష్టతో బింబిసార 2 వ‌ర్కౌట్ కాక‌పోతే కళ్యాణ్ రామ్ వేరొక దర్శకుడితో చేస్తాడేమో వేచి చూడాల్సి ఉంది..!