పెట్రోల్ ధ‌ర త‌గ్గించిన త‌మిళ సీఎం ఎంకె స్టాలిన్‌

విధాత‌: పెట్రోలు ధరలతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సిఎం ఎంకె స్టాలిన్‌ నేతృత్వంలోని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ పద్దు తయారీ సందర్భంగా పెట్రోల్‌ ధరలను తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. లీటరు పెట్రోలుపై రూ.3 వంతున ధర తగ్గించింది.ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ ప్రకటించారు.లీటరు పెట్రోలుపై రూ.3 ధర తగ్గించడం వల్ల తమిళనాడు రాష్ట్ర ఖజానాకు రూ.1,160 కోట్ల నష్టం వస్తుందని,అయినా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం […]

పెట్రోల్ ధ‌ర త‌గ్గించిన త‌మిళ సీఎం ఎంకె స్టాలిన్‌

విధాత‌: పెట్రోలు ధరలతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సిఎం ఎంకె స్టాలిన్‌ నేతృత్వంలోని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ పద్దు తయారీ సందర్భంగా పెట్రోల్‌ ధరలను తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. లీటరు పెట్రోలుపై రూ.3 వంతున ధర తగ్గించింది.ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ ప్రకటించారు.లీటరు పెట్రోలుపై రూ.3 ధర తగ్గించడం వల్ల తమిళనాడు రాష్ట్ర ఖజానాకు రూ.1,160 కోట్ల నష్టం వస్తుందని,అయినా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. డీజిల్‌ రేట్ల తగ్గింపు ఉంటుందా లేదా అనేదానిపై ఎలాంటి ప్రకటన రాలేదు.