Jawan Pabballa Anil | జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం.. తెలంగాణ జవాన్ మృతి
Jawan Pabballa Anil మృతుడు బోయినపల్లి మండలం మల్కాపూర్ వాసి 11 ఏళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్న అనీల్ గ్రామంలో విషాద ఛాయలు విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ కు చెందిన ఆర్మీ జవాన్ అబ్బాల అనిల్ (Jawan Pabballa Anil) జమ్మూ కాశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. అనిల్ గత 11 ఏళ్లుగా ఆర్మీలో పనిచేస్తుండగా గురువారం జమ్మూ కాశ్మీర్ వద్ద సాంకేతిక కారణాలతో అనిల్‌తో పాటు […]

Jawan Pabballa Anil
- మృతుడు బోయినపల్లి మండలం మల్కాపూర్ వాసి
- 11 ఏళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్న అనీల్
- గ్రామంలో విషాద ఛాయలు
విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ కు చెందిన ఆర్మీ జవాన్ అబ్బాల అనిల్ (Jawan Pabballa Anil) జమ్మూ కాశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు.
అనిల్ గత 11 ఏళ్లుగా ఆర్మీలో పనిచేస్తుండగా గురువారం జమ్మూ కాశ్మీర్ వద్ద సాంకేతిక కారణాలతో అనిల్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నదిలో కూలిపోయింది.
ఈ విశాద వార్త తెలిసిన వెంటనే అనిల్ భార్య సౌజన్య, కుమారులు అయాన్, అరవు. తల్లి,తండ్రులు మల్లయ్య, లక్ష్మి, సోదరులు శ్రీనివాస్, మహేందర్ దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. అనిల్ మృతితో మల్లాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.