మద్రాస్ హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం

విధాత:హిందూ దేవాలయాల పై ప్రభుత్వాలు చేస్తున్న చెత్త పెత్తనాన్ని రూపుమాపేలా ఈరోజు మద్రాస్ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ప్రకటించడం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా దేవాలయ పవిత్రత మరియు ఆస్తుల పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమానికి దోహదం చేస్తుంది. తీర్పు వెలువరించే సందర్భంగా జస్టిస్ S.R . మహదేవన్ గారు సెక్యులరిజం ముసుగులో దేవాలయాల ఆస్థులను ప్రభుత్వాలు దోచుకుంటున్న విషయాన్ని,దేవాలయాలలో అన్యమతస్తుల ఆగడాలను , దేవాలయాల పై ప్రభుత్వాల చెత్త పెత్తనాన్ని, హిందూ ధర్మం కోసం […]

మద్రాస్ హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం

విధాత:హిందూ దేవాలయాల పై ప్రభుత్వాలు చేస్తున్న చెత్త పెత్తనాన్ని రూపుమాపేలా ఈరోజు మద్రాస్ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ప్రకటించడం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా దేవాలయ పవిత్రత మరియు ఆస్తుల పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమానికి దోహదం చేస్తుంది. తీర్పు వెలువరించే సందర్భంగా జస్టిస్ S.R . మహదేవన్ గారు సెక్యులరిజం ముసుగులో దేవాలయాల ఆస్థులను ప్రభుత్వాలు దోచుకుంటున్న విషయాన్ని,దేవాలయాలలో అన్యమతస్తుల ఆగడాలను , దేవాలయాల పై ప్రభుత్వాల చెత్త పెత్తనాన్ని, హిందూ ధర్మం కోసం దాతలు సమర్పించిన ఆస్థులను ప్రభుత్వ భోగాలకు,ఇతర మతాలకు ఖర్చు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ చేసిన వాఖ్యలు హిందూ దేవాలయాల వ్యవస్థను ప్రభుత్వాల కబంధ హస్తాల నుండి తొలగించాల్సిన విషయాన్ని స్పష్టం చేస్తుంది .

మద్రాసు హైకోర్టు తీర్పును పూర్తిగా పరిశీలించి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి కూడా దేవాలయాల ఆస్థులను కాపాడటానికి , అన్యమతస్తులను తొలగించడానికి మరియు హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల పెత్తనాన్ని రూపుమాపడానికి అవసరమైన న్యాయ పరమైన ప్రక్రియ ప్రారంభిస్తాము, నేడు మద్రాసు హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు ‘ఫ్రీ హిందూ టెంపుల్’పేరుతో దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమానికి ఒక ముందడుగా భావిస్తున్నాము.