ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తో పాటు టీవీ5 న్యూస్ ఛానెల్ పై ఏపి ప్రభుత్వం పెట్టిన రాజద్రోహం కేసు పై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు…

★ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో పాటు టీవీ5 న్యూస్ చానల్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటీషన్ తో పాటుగా, దాఖలైన కోర్టు ధిక్కరణ పిటీషన్ పై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ★ జస్టిస్ చంద్రచూద్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటీషన్ పై విచారణ చేసింది. ★ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కోరిన ఇంట్రియం ప్రేయర్ ను సుప్రీం కోర్టు అంగీకరించింది. ★ తమ పై ఎలాంటి దూకుడు చర్యలు తీసుకొకూడదు అంటూ […]

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తో పాటు టీవీ5 న్యూస్ ఛానెల్ పై ఏపి ప్రభుత్వం పెట్టిన రాజద్రోహం కేసు పై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు…

★ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో పాటు టీవీ5 న్యూస్ చానల్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటీషన్ తో పాటుగా, దాఖలైన కోర్టు ధిక్కరణ పిటీషన్ పై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.

★ జస్టిస్ చంద్రచూద్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటీషన్ పై విచారణ చేసింది.

★ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కోరిన ఇంట్రియం ప్రేయర్ ను సుప్రీం కోర్టు అంగీకరించింది.

★ తమ పై ఎలాంటి దూకుడు చర్యలు తీసుకొకూడదు అంటూ సుప్రీం కోర్టుని కోరగా, తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు, రాష్ట్ర ప్రభుత్వం పిటీషనర్ల పై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

★ ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న ఏపి ప్రభుత్వం, సిబిసిఐడి, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

★ నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణ వచ్చేంత వరకు కూడా, ఎలాంటి దుందుడుకు చర్యలు చేపట్టకూడదని ధర్మాసనం పేర్కొంది.

★ ఈ కేసుని ఆరు వారాల పాటు వాయిదా వేసింది.

★ నాలుగు వారాలు లోగా ప్రతివాదులు అందరూ కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

★ అయితే ఈ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

★ మీడియా ప్రసారం చేసిన ప్రతి అంశాన్ని కూడా బూతద్ధంలో చూపించి, వాళ్ళకు ఉన్న హక్కులు కాలరాస్తున్నారని పేర్కొంది.

★ ప్రతి దాన్ని రాజద్రోహంగా ప్రభుత్వాలు భావించటం పరిపాటి అయిపొయింది అంటూ కోర్టు వ్యాఖ్యలు చేసింది.

★ ప్రతి సారి ఈ విధమైన చర్యలు లేకుండా, అసలు రాజద్రోహం అంటే ఏమిటి, ఇందులో ఏమి వస్తాయి, ఏ కేసులు వస్తాయి, ఏ అంశాలు వస్తాయి, ఏ సెక్షన్ లు వస్తాయి, ఇలా పూర్తి విషయాల పై కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

★ ఈ కేసులోనే అసలు రాజద్రోహం అంటే ఏమిటి అంటూ పూర్తి మార్గదర్శకాలతో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాసం ఉంది.

★ దీంతో ఈ కేసు ఇప్పుడు భారత దేశ దృష్టిని ఆకర్షించిందనే చెప్పాలి.

★ ఈ కేసు ఒక మైలు రాయిగా నిలిచిపోనుంది.

★ ఇక పైన ఎవరు పడితే వారు, ఏ కేసు పడితే ఆ కేసు పెట్టకుండా, కొన్ని మార్గదర్శకాలు సుప్రీం కోర్టు చెప్పే అవకాసం ఉంది.

★ అంతకు ముందు పిటీషనర్ తరుపు న్యాయవాదులు, తమ పై పెట్టిన రాజద్రోహం కేసు పై, తమ వాదనను సుప్రీం కోర్టు ముందు ఉంచారు.

★ తాము ఒక ఎంపీ మాట్లాడిన విలేఖరులు సమావేశం చూపిస్తేనే, దాన్ని రాజద్రోహం అని ఎలా చెప్తారు అంటూ సుప్రీం కోర్ట్ ని ప్రశ్నించారు.