భారీ అనకొండలకు కావాల్సిన ఆహారం అడవులు, నదులలో దొరకడం అంత సులభం కాదు. అందుకే అవి తమ శరీర నిర్మాణం, ఆకృతిని ఎరను వేటాడటంలో విభిన్నంగా వినియోగిస్తూ ఆహార సంపాదన కోసం ప్రయత్నిస్తుంటాయి. తాజాగా ఓ సబ్ సహారా ఆఫ్రికా ప్రాంతంలో ఓ ఆఫ్రికన్ భారీ అనకొండ( రాక్ పైథాన్) ఆహారం కోసం పాట్లు పడుతున్న ఓ వీడియో వైరల్ గా మారింది.
వీడియోలో రాక్ పైథాన్ ఓ రాళ్లు, పుట్టవంటి మట్టి దిబ్బపై నెమ్మదిగా, ప్రశాంతంగా కదులుతూ కనిపించింది. ఎర కోసం అది నిశ్శబ్దంగా నెమ్మదిగా మాటు వేసి ఉంది. దాని ప్రశాంత కదలికలు ప్రణాళికయుతమైన వేట ఎత్తులని..అయితే దానికి ఆకలి వేసినప్పుడు, వేటాడే దాని సహజ ప్రవృత్తితో విరుచుకపడుతుందని సరీసృప నిపుణలు చెబుతున్నారు.
సబ్-సహారా ఆఫ్రికాకు చెందిన ఈ విషరహిత కొండచిలువలు 20 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉంటాయి. ఇవి తమ శక్తివంతమైన కండరాలను ఉపయోగించి చిన్న క్షీరదాల నుండి జింకల వంటి పెద్ద జంతువుల వరకు తమ ఎరను ఊపిరాడకుండా చేసి చంపుతాయని తెలిపారు.
This African rock python may seem slow and calm, but don’t let its silence fool you. When hunger strikes, its hunting instinct takes over. pic.twitter.com/F7g80ICMbY
— Brutal Nature (@BrutaINature1) June 29, 2026
