ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా.. ప్రమాణ స్వీకార వేడుక కోసం కృష్ణాజిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇరవై ఎకరాల ప్రాంగణంలో మూడు అత్యంత భారీ టెంట్లను ఏర్పాటు చేశారు.