Viral Video : రోడ్డు టాక్స్ వసూలు చేస్తున్న ఏనుగులు..వైరల్ వీడియో!
చెరకు లారీలను అడ్డుకుని చెరుకు గడలు తీసుకుంటున్న ఏనుగులు.. ‘రోడ్డు టాక్స్’ వసూలు చేస్తున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్!

విధాత : అటవీ మార్గాలు…అభయారణ్య రహదారుల గుండా వాహనాలకు ఎక్కడో ఓ చోట చెక్ పోస్టులు ఉండటం చూస్తుంటాం. కాని ఓ అటవీ మార్గంలో మాత్రం ఏనుగులు రోడ్డు టాక్స్ వసూలు చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. అభయారణ్య ప్రాంతంలోని ఓ జాతీయ రహదారిపై ఏనుగుల క్రాసింగ్ అని రాసిన హెచ్చరికల బోర్డు పక్కన మాటు వేసిన ఏనుగు ఆ మార్గంలో వెళ్లే చెరుకు లారీలకు ఆడ్డం పడి చెరకు గడలను లాగేసుకుని ఆరగించింది. తను చెరకు గడలు తీసుకున్నాకే ఆ లారీకి అడ్డు తొలగింది. తర్వాతా మరో చెరుకు లారీరాగానే దానికి కూడా అడ్డుపడి చెరకు గడలు లాగేసుకుని అది ముందుకు వెళ్లేందుకు అనుమతించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇది చూసిన నెటిజన్లు ఏనుగులు రోడ్డు టాక్స్ వసూలు చేస్తున్నట్లుగా ఉందంటూ కామెంట్లతో నవ్వుకుంటున్నారు. అంతేకదా..ఏనుగులు..వన్యప్రాణులు నివసించే అడవిలో రహదారి నిర్మించినందునా అవి టాక్స్ వసూలు చేసుకుంటున్నాయని మరికొందరు కామెంట్ పెట్టారు. ఇంకొందరు అసలు ఇలా ఏనుగు వసూలు చేసిన పన్నును ఏమంటారని కామెంట్ పెట్టారు. అయితే ఆ మార్గంలో చెరకు లోడ్ లారీలను మాత్రమే గుర్తించి అడ్డుకునే ఏనుగులు మిగతా వాహనదారులను మాత్రం ఏమీ అనకపోవడం ఇక్కడ మరో విశేషం.
గతంలో బెంగుళూరు దిండిగల్ జాతీయ రహదారిలోని అసనూర్ వద్ద ఏనుగులు తరచుగా చెరకు ట్రక్కులను అడ్డగించడం, చెరకు దొంగిలించడం సర్వసాధారణంగా మారింది. కొంతకాలం క్రితం జాతీయ రహదారిపై తన చెరుకు లారీకి అడ్డుపడిన ఏనుగుకు చెరుకు గడలు వేసిన లారీ డ్రైవర్ వీడియోను చూసిన పోలీసులు అతనికి రూ.75వేలు జరిమాన విధించారు. వన్యప్రాణులను అడవి లోపల వాటి స్థానంలోనే ఉంచాలని..ఇలా ఆహారం పెడితే రోడ్లపైకి, మనుషులు ఉండే చోట్లకు వస్తాయని…అప్పుడు అది ప్రమాదాలకు దారి తీస్తుంది.” అని ఐఎఫ్ ఎస్ అధికారి ప్రవీణ్ కాశ్వాన్ హెచ్చరించారు.