Robo Boxing | ప్రపంచంలో.. తొలిసారి రోబోల మధ్య బాక్సింగ్

విధాత: రోబోలు ఇప్పటికే మనుషులు నిర్వహించే అనేక రంగాల పనులు చేస్తున్నాయి. శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు వ్యవసాయం వంటి పనుల్లోనూ మనుషుల కంటె బెటర్ గా వ్యవహరిస్తున్నాయి. మనుషులు చేయలేని రెస్క్యూ ఆపరేషన్ లు సైతం చేస్తూ మానవాళికి సేవలందిస్తున్నాయి. ఇప్పుడు క్రీడల్లోనూ రోబోలు రంగ ప్రవేశం చేస్తున్నాయి. ఇప్పటిదాక బాక్సింగ్ పోటీలు మనుషులు మధ్యనే చూశాం. ఇక మీదట రోబోలకు కూడా బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తారట. ఇందుకు చైనా దేశం వేదిక కానుండటం విశేషం. ప్రపంచంలో తొలిసారిగా
వచ్చే నెల రోబో బాక్సింగ్ పోటీలు చైనాలో తలపడబోతున్నాయి. రోబోల బాక్సింగ్ పోటీలకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రెండు హ్యూమనాయిడ్ రోబోలు ప్రపంచంతో తొలిసారి నిర్వహించనున్న రోబో బాక్సింగ్ పోటీలో తలపడనున్నాయి. ఈ రోబో బాక్సింగ్ పోటీని లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు చైనా రోబోటిక్ సంస్థ యునిట్రీ వెల్లడించింది. ఈ పోటీకి సంబంధించి ఒక ప్రమోషనల్ వీడియోను కూడా సంస్థ విడుదల చేసింది.”యూనిట్రీ ఐరన్ ఫిస్ట్ కింగ్-అవేకనింగ్” పేరుతో ఈ పోటీ నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించింది.
రోబో బాక్సింగ్ పోటీలో 4.3 అడుగుల ఎత్తున్న జీ1తో 5.11 అడుగుల ఎత్తున్న H1 హ్యూమనాయిడ్ రోబో తలపడనుంది. అత్యుత్తమ కంప్యూటరీ శక్తి, చురుకైన కదలికలు, నియంత్రణ ఈ రోబోల సొంతం. పోటీలో ప్రత్యర్థి పంచ్ ల నుంచి తప్పించుకోవడం, ఎదురుదాడి కిక్ పంచ్ లు కొట్టడంలో మరి ఈ మర మనుషుల బాక్సర్ లు ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరం. రోబోల బాక్సింగ్ మనుషుల మధ్య జరిగే బాక్సింగ్ మాదిరిగా భావోద్వేగాలతో సాగుతుందా లేక మరమనుషులు మాదిరిగానే కృత్రిమంగా కొనసాగుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.
ప్రపంచంలో.. తొలిసారి రోబోల మధ్య బాక్సింగ్ first time in the world, a boxing match between two humanoid robots took place in China. Chinese robotics company Unitree released a promotional video related to this match #China #Robot #ViralVideo pic.twitter.com/7GoWFWgXDe
— srk (@srk9484) April 14, 2025