మాల్ లోకి చొరబడిన మానిటర్ బల్లి…అంతా పరుగు
మాల్‌లోకి చొరబడిన మానిటర్ బల్లితో హడావుడి వాతావరణం నెలకొంది. జనం భయంతో పరుగులు తీయగా, ఆ ఉడుము మాల్ లో వస్తువులను చిందరవందర చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విధాత: అటవీ ప్రాంతాల్లో కనిపించే మానిటర్ బల్లి(ఉడుము రకం జాతి)ని చూస్తేనే దూరంగా పారిపోతారు. అలాంటిది ఏకంగా అది ఓ మాల్ లో జనం మధ్యలోకి వస్తే ఇంకేముంది..అంతా పరుగే పరుగు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. సమీప అటవీ ప్రాంతంలో నుంచి వచ్చిందో ఏమోగాని…ఓ సూపర్ మార్కెట్ మాల్ లో ప్రవేశించిన మానిటర్ బల్లి అందులో తనకు ఆహారంగా తీసుకోవాల్సిందేమిటో తెలియక…అందులో నుంచి బయట పడే మార్గం దొరకకా..మాల్ లో రచ్చరచ్చ చేసింది. అటు ఇటు తిరుగుతూ…మాల్ లోని సెల్ఫ్ లలోని వస్తువులను చిందర వందర చేసేసింది. మాల్ లో ఉన్న జనం..సిబ్బంది దానిని చేసి భయంతో బయటకు పారిపోయారు. చివరకు రెస్క్యూ టీమ్ వచ్చి దాన్ని బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు.
ప్రపంచంలోని 31 ఉడుము జాతులుండగా..వీటిలో కొమొడో డ్రాగన్ అతి పెద్దది. ఇండోనేషియాలోని కొమొడో, రింకా, ఫ్లోరెస్, గిలి మోటాంగ్ , పాడార్ దీవులలో కనిపిస్తుంది. భారతదేశంలో బెంగాల్ ఉడుము, ఎరుపు ఉడుము, ఎడారి ఉడుము, పసుపు ఉడుములు కనిపిస్తుంటాయి. ఈ నాలుగు కూడా అంతరించిపోయే జాతులలో ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ వన్ కింద ఇవి రక్షించబడుతున్నాయి.
I like to think monitor lizards still think they’re tiny incognito regular lizards and don’t realize they’re giant monsters pic.twitter.com/aizGsI1IxW
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 30, 2025