చింత మొక్క గుండ్రంగా తిరుగుతుంది..వైరల్ గా ఘటన

భద్రాద్రి జిల్లాలో చింత మొక్క గుండ్రంగా తిరుగుతున్న వింత వీడియో వైరల్.. ఇది మాయనా? దైవమా? భూమిలో పురుగుల ప్రభావమా?

చింత మొక్క గుండ్రంగా తిరుగుతుంది..వైరల్ గా ఘటన

విధాత : భూమి లోపలి నుంచి ఎదిగే మొక్కలు తమ వేర్లతో ఉన్న చోటనే ఎటు కదలకుండా నిలకడగా పైకి పెరుగుతుంటాయి. వేర్లు మాత్రం భూమి లోపలికి చొచ్చుకపోవడం సహజం. అయితే ఓ చింత మొక్క గుండ్రంగా తిరుగుతున్న వింత ఘటన వైరల్ గా మారింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం సీతారాంపురంలో చోటుచేసుకుంది. ఈ గ్రామంలోని ఓ చింత మొక్క తనంతట తాను గుండ్రంగా తిరుగుతుంది. దీంతో ఆశ్చర్యానికి గురైన గ్రామస్తులు తండోపతండాలుగా వచ్చి ఆ వింతను చూస్తున్నారు.

ఇది వింతనా?..లేక దైవ మహిమానా..దెయ్యం .మాయనా? అనుకుంటూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందని మరికొందరుచింత మొక్క గుండ్రంగా తిరగడంపై రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. అయితే భూమి లోపల పురుగులు ఆ మొక్క వేర్లను తింటుండటం..లేక భూమిలోని పురుగులు అక్కడ తొలచివేస్తున్న నేపథ్యంలోనే ఆ చింత మొక్క అలా కదిలిందని హేతువాదులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి చివరగా ఏం జరిగిందన్నది తెలియాల్సి ఉంది.