Jubilee Hills By-poll Analysis | ఒక్క ఉప ఎన్నికలో ఎందుకింత హంగామా?

ఉప ఎన్నిక ఎక్కడ వచ్చినా ఇటీవల కాలంలో పార్టీల నాయకత్వం వ్యక్తిగత ప్రెస్టేజీగా భావిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ మార్పునకు ఈ ఎన్నికల ఫలితమెంత దోహదం చేస్తుందో ఏమోగానీ.. పతాక స్థాయి ప్రచారం చేశారు. కోట్లాది రూపాయలు కుమ్మరించాయి. విజయం సాధించేందుకు సకల శక్తులను మోహరిస్తూ ఒక్క ఉప ఎన్నికను రాష్ట్ర ఎన్నికగా మార్చివేశారు. దీంతో ఉప ఎన్నికలంటేనే కొన్ని పక్షాలు పోటీకి వణికిపోతున్నాయి

Jubilee Hills By-poll Analysis | ఒక్క ఉప ఎన్నికలో ఎందుకింత హంగామా?

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

Jubilee Hills By-poll Analysis | ఒకప్పుడు అనివార్యకారణాలతో ఉప ఎన్నికలొస్తే పోటీలేకుండా ఏకగ్రీవంగా ఎన్నికకు అన్ని పక్షాలు అంగీకరించే పరిస్థితి నుంచి, ఇప్పుడు ఎన్నికొస్తే పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో హుజురాబాద్‌ ఉప ఎన్నిక.. మొత్తం ఉప ఎన్నికలను పీక్ స్టేజీకి చేర్చిన విషయం తెలిసిందే. ఇక దుబ్బాక, నారాయణఖేడ్, హుజుర్ నగర్, నాగార్జున సాగర్, పాలేరు ఉప ఎన్నికల తీరు ఎలాసాగిందో అందరికీ తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఇప్పటికే రెండు ఉప ఎన్నికలు పూర్తయ్యాయి. కంటోన్మెంటు ఎన్నికలు సాధారణ ఎన్నికల్లో కలిసిపోవడంతో పోటీ పెద్దగా కనిపించలేదుగానీ, ప్రస్తుతం ముగిసిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విజయం కోసం మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సర్వశక్తులొడ్డాయి. రాష్ట్రంలో మరో సమస్యలేనట్లు జూబ్లీ ఎన్నిక చుట్టూ రాజకీయాన్ని మార్చివేశారు. ఈ ఉప ఎన్నికల గెలుపోటములు రాష్ట్రంలో అధికారాన్ని తలకిందులు చేస్తాయనే స్థాయిలో ప్రచారం సాగింది. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు ప్రచారాన్ని కొనసాగించారు.

Jubilee Hills By-poll Analysis | ‘జూబ్లీ’ ఫలితం ప్రభావమెంత? లాభనష్టాల లెక్కల్లో పార్టీలు!

ఉప ఎన్నిక ఎక్కడ వచ్చినా ఇటీవల కాలంలో పార్టీల నాయకత్వం వ్యక్తిగత ప్రెస్టేజీగా భావిస్తున్నది. రాష్ట్రంలో రాజకీయ మార్పునకు ఉప ఎన్నిక ఫలితం ఎంత దోహదం చేస్తుందో కానీ.. పతాక స్థాయి ప్రచారం చేశారు. పార్టీలు పోటాపోటీగా పాల్గొన్నాయి. కోట్లాది రూపాయలు కుమ్మరించాయి. విజయం సాధించేందుకు సకల శక్తులను మోహరిస్తూ ఒక్క ఉప ఎన్నికను రాష్ట్ర ఎన్నికగా మార్చివేసి చావు బతుకుల సమస్యగా చేశాయి. ఇక విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్ళు, ప్రతిసవాళ్ళ లక్ష్మణ రేఖ దాటిపోయి పరిస్థితిని జుగుప్సాకరంగా మార్చారు. దీంతో ఉప ఎన్నికలంటేనే కొన్ని పక్షాలు పోటీకి వణికిపోతున్నాయి.

CM Revanth:ఈ విజయం భూకంపం వచ్చే ముందు ఇచ్చే అలర్ట్ లాంటిది

సకల హంగులూ…సర్వ శక్తులు

మూడు నెలలపాటు రాష్ట్రాన్ని కుదిపేసిన జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు శుక్రవారం వెలువడ్డాయి. ఎన్నికల ప్రచార ప్రారంభం నుంచి ఈ పార్టీ గెలుస్తోంది… ఆ పార్టీ గెలుస్తోందీ…. మా పార్టీయే గెలుస్తుందంటూ ఊదరగొట్టిన ప్రచారం. ఊహాగానాలు, రాజకీయ జోస్యాలు, ఆఖరికి సర్వేల పేరుతో సమర్పించిన సొంత నివేదికలు, నాటకాలు, ఫేక్ప్రచారాలు, సోషల్ మీడియా ఆడంబరాలు, ప్రసార సాధనాల ప్రయోగం, పెయిడ్ న్యూస్ ఒక్కటేమిటీ సకల హంగులు, రంగులను ఈ ఎన్నికల్లో వినియోగించారు. ఈ క్రమంలో కూడా గెలుపోటములు దోబూచులాడుతూ వచ్చాయి. ప్రచారంలో తిట్లు, శాపనార్ధాలు, ఏడ్పులు, కన్నీటి పర్యంతాలు, గొడవలు, ముద్దుగా చెప్పుకునే ‘పోల్ మేనేజ్ మెంట్’, దొంగ ఓట్లు, అధికార దుర్వినియోగం, లాఠీచార్జీల మధ్య ముగిసిన పోలింగ్ అనంతరం మరోసారి సర్వే ఫలితాల హడావుడి, బెట్టింగులతో రాష్ట్ర రాజకీయం నిన్నటి వరకు వేడెక్కించారు. తాజాగా శుక్రవారం ఉదయం నుంచి ప్రారంమైన ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపినప్పటికీ రౌండ్ వారీగా తొలి నుంచి కాంగ్రెస్ ఆధిక్యాన్ని చాటిచెప్పి దాదాపు 25వేల మెజార్టీతో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నవీన్ యాదవ్ గెలుపొందారు. భర్త అకాల మృతితో అనివార్యంగా బరిలో నిలిచి, గెలుపు తమదేనని భావించిన బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీతకు సానుభూతి పట్టం కట్టలేదు. జూబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనంటూ పోటీలో నిలిచిన బీజేపీ అభ్యర్ధి దీపక్‌రెడ్డికి డిపాజిట్ గల్లంతయ్యింది.

Read Also |

Revanth Reddy Strategy | అభ్యర్థి ఎంపిక, టీమ్‌ వర్క్‌, సీఎం ప్రత్యక్ష పర్యవేక్షణ.. జూబ్లీహిల్స్ విజయంలో ఇవే కీలక అంశాలు!
బీహార్‌ ఎన్డీయే గెలుపులో ఆ 7,500 కోట్ల పాత్రే కీలకం!
India Alliance Defeat in Bihar Assembly : బీహార్ లో ఇండియా కూటమికి పరాజయానికి కారణాలేమిటీ?