Sugarcane Juice | ‘చెరుకు రసం’తో కాసుల వర్షం.. ఏడాదికి రూ. 40 లక్షలు సంపాదిస్తున్న ఐటీఐ స్టూడెంట్
Sugarcane Juice | అతను ఐటీఐ డిప్లొమా(మెకానికల్) స్టూడెంట్. కానీ మెకానికల్ వైపు దృష్టి సారించలేదు. తనకు వారసత్వంగా వచ్చిన భూమినే నమ్ముకున్నాడు. పూర్తిగా సేంద్రీయ( Organic ) పద్ధతుల్లో చెరుకు పంట( Sugarcane ) ద్వారా ఉత్పత్తి అయ్యే షుగర్‌కేన్ జ్యూస్( Sugarcane Juice )తో ఏడాదికి రూ. 40 లక్షలు సంపాదిస్తున్నాడు. మరి ఆ యువ రైతు( Young Farmer ) గురించి తెలుసుకోవాలంటే హర్యానా( Haryana )లోని సోనిపట్ జిల్లా( Sonipat District )లో కాలు మోపాల్సిందే.
Sugarcane Juice | హర్యానా( Haryana )లోని సోనిపట్ జిల్లా( Sonipat District )లోని గోహన గ్రామానికి( Gohana Village ) చెందిన జోగేశ్ మాలిక్( Jogesh Malik ).. 2012లో ఐటీఐ డిప్లొమా(మెకానికల్) పూర్తి చేశాడు. మాలిక్ కుటుంబ సభ్యులు వరి, గోధుమ, చెరుకు పంట( Sugarcane )లను పండించేవారు. అయితే 2011లో జోగేశ్ కుటుంబం ఆస్తుల పంపకం చేసింది. దీంతో జోగేశ్‌కు వారసత్వంగా 4.5 ఎకరాల భూమి వచ్చింది. అయితే ఈ భూమిలో చెరుకునే పండించాలని జోగేశ్ నిర్ణయించుకున్నాడు. కానీ ఈ పంటతోనే భారీగా ఆర్థిక లాభాలు గడించేలా ప్లాన్ చేశాడు. మరి ఆ ప్లాన్ ఏంటి..? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
కిలో చెరుకును కేవలం రూ. 3 నుంచి రూ. 4కు మాత్రమే
స్థానికంగా రైతులు పండించిన చెరుకు పంటను షుగర్ కంపెనీలకు విక్రయిస్తారు. కిలో చెరుకును కేవలం రూ. 3 నుంచి రూ. 4కు మాత్రమే విక్రయిస్తారు. ఈ డబ్బుల కోసం నెలల తరబడి రైతులు ఎదురుచూడాలి. పెట్టుబడికి కూడా ఈ డబ్బులు సరిపోవు. దీంతో చెరుకు పంటను పండిస్తూనే కొత్తగా ఏదైనా చేయాలని జోగేశ్ సంకల్పించాడు.
చెరుకును రసంగా మార్చి విక్రయిస్తే..
2019లో జోగేశ్ వినూత్నంగా ఆలోచించాడు. చెరుకును షుగర్ కంపెనీలకు విక్రయిస్తే వారు కిలో చెరుకుకు కేవలం రూ. 3 నుంచి రూ. 4 మాత్రమే చెల్లిస్తున్నారు. అదే మనం.. చెరుకును రసంగా మార్చి విక్రయిస్తే.. అంతకంతకు ఆదాయం పొందొచ్చు కదా అని గ్రహించాడు. ఇంకేముంది తక్కువ పెట్టుబడితో ఆ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇక రెండున్నర ఎకరాల పొలంలో చెరుకు పండిస్తూ.. దాంతో చెరుకు రసం, షుగర్‌కేన్ పాప్‌స్కిల్స్ విక్రయిస్తూ ఏడాదికి రూ. 40 లక్షలు సంపాదిస్తున్నాడు జోగేశ్.
ఒక కిలోగ్రామ్ చెరుకు నుంచి 500 మి.లీ. షుగర్‌కేన్ జ్యూస్
ఒక కిలోగ్రామ్ చెరుకు నుంచి 500 మి.లీ. నుంచి 600 మి.లీ. వరకు చెరుకు రసాన్ని ఉత్పత్తి చేయొచ్చు. 250 మి.లీ. గ్లాసు చెరుకు రసాన్ని రూ. 20కి విక్రయించొచ్చు. అంటే ఒక కిలోగ్రామ్ చెరుకు నుంచి ఉత్పత్తి అయ్యే జ్యూస్‌కు రూ. 40 వరకు ఆర్జించొచ్చు. ఇది షుగర్ కంపెనీలు చెల్లించే నగదుకు పదింతలు. కాబట్టి జోగేశ్ ఇదే వ్యాపారంపై దృష్టి సారించాడు.
షుగర్ జ్యూస్, పాప్‌స్కిల్స్ విక్రయిస్తూ..

ఇంకేముంది.. జోగేశ్ ఒక ట్రాక్టర్ ట్రాలీని కొనుగోలు చేశాడు. దాన్ని ఫుడ్ ట్రైలర్‌గా మార్చేశాడు. చెరుకు రసంతో పాటు షుగర్ పాప్‌స్కిల్స్ విక్రయించడం ప్రారంభించాడు. ఇందుకోసం రూ. 7 లక్షల వరకు జోగేశ్ పెట్టుబడి పెట్టాడు. ఇక ట్రాక్టర్ ట్రాలీపై సోనిపట్ జిల్లాలో తిరుగుతూ.. షుగర్ జ్యూస్, పాప్‌స్కిల్స్ విక్రయిస్తూ.. స్థానికులకు ఆ రుచిని చూపించాడు.
పెట్టిన పెట్టుబడిని ఏడాది లోపే..
ఇక చెరుకు రసానికి, పాప్‌స్కిల్స్‌కు డిమాండ్ పెరిగింది. ఆర్డర్లు కూడా భారీగా పెరిగాయి. ఫ్రీజర్ కూడా కొనుగోలు చేశాడు. పెట్టిన పెట్టుబడిని ఏడాది లోపే సంపాదించేశాడు. లాభాలు కూడా వచ్చాయి. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు.. ట్రాక్టర్ ట్రాలీ సెటప్‌పై ఒక సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేశాడు. ఈ సోలార్ విద్యుత్ ద్వారా ఫ్రీజర్, జ్యూస్ మెషీన్ రన్ అవుతాయి.
ఎండకాలంలో భారీ డిమాండ్
చెరుకుతో చేసిన ఉత్పత్తులను జోగేశ్ రిటైల్ మార్కెట్‌లో కూడా విక్రయిస్తున్నాడు. హర్యానా వ్యాప్తంగా తన వ్యాపారాన్ని విస్తరించాడు. చెరుకు ద్వారా ఉత్పత్తి చేసే చుష్కీ అత్యధికంగా అమ్ముడవుతోంది. ఒక్కో పీస్‌ను రూ. 20కి విక్రయిస్తున్నాడు. ఎండకాలంలో వీటికి భారీ డిమాండ్ ఉంటుంది. ఇక చెరుకు రసాన్ని ఒక్కో గ్లాస్‌ను రూ. 30 నుంచి రూ. 40కి విక్రయిస్తున్నాడు.
ఏడాదికి ఎకరాకు రూ. 12 లక్షల ఆదాయం
అయితే ఎకరాకు 200 క్వింటాళ్ల చెరుకు దిగుబడి అవుతుంది. క్వింటాల్‌కు రూ. 8 వేల వరకు ఆదాయం సంపాదిస్తున్నాడు. అంటే ఏడాదికి రూ. 16 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నాడు జోగేశ్. ఒక ఎకరా చెరుకు సాగుకు రూ. 40 వేలు ఖర్చు అవుతుంది. దీని ప్రాసెసింగ్‌కు రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఖర్చులు పోనూ ఏడాదికి ఎకరాకు రూ. 12 లక్షల ఆదాయం మిగులుతుంది.
ఆర్గానిక్ పద్ధతుల్లోనే చెరుకు సాగు..
తనకున్న 4.5 ఎకరాల్లో 2.5 ఎకరాల్లో చెరుకు పండిస్తున్నాడు. మిగతా పొలంలో గోధుమలు, ఇతర పంటలు సాగు చేస్తున్నాడు. చెరుకు పంటను పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లోనే పండిస్తున్నాడు. ఇందుకోసం జీవామృతం వినియోగిస్తున్నాడు. ఎప్పటికప్పుడు నేలను సారవంతం చేస్తున్నాడు. Coh 191 షుగర్‌కేన్ వెరైటీని సాగు చేస్తున్నాడు. ఇది త్వరగా పెరిగి, అధిక దిగుబడిని ఇస్తుంది. ఈ రకాన్ని చౌదరి చరణ్ సింగ్ హర్యానా అగ్రికల్చర్ యూనివర్సిటీ సృష్టించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram