యూఏఈ క్వీన్ మదర్‌కు కరీంనగర్ ఫిలిగ్రీ బాక్స్ కానుక
యూఏఈ క్వీన్ మదర్ షేక్ ఫాతిమాకు ప్రధాని మోదీ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ బాక్స్ బహుమతిగా ఇచ్చారు. తెలంగాణ కళాకారులకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల యూఏఈ పర్యటనలో భాగంగా ఆ దేశ క్వీన్ మదర్ షేక్ ఫాతిమాకు ఇచ్చిన కానుకా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూఏఈ క్వీన్ మదర్ షేక్ ఫాతిమాకు ప్రధాని మోదీ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ బాక్స్, మహేశ్వరి సిల్క్ వస్త్రాన్ని బహుమతిగా ఇచ్చారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ అరుదైన వెండి నగిషీ (నక్షీ) పెట్టె భారతీయ హస్తకళల వైభవాన్ని చాటింది. యూఏఈ క్వీన్ మదర్ కు బహుమతి రూపంలో అంతర్జాతీయ వేదికపై కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళకు మరోసారి అరుదైన గౌరవం దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
వెండి తీగతో కళాకారులు ఆవిష్కరించే అద్భుతమైన సిల్వర్ ఫిలిగ్రీ హస్త కళా ఉత్పత్తులు ఇప్పటికే కరీంనగర్ ఖ్యాతిని నలుదిశలా చాటాయి. గతేడాది జరిగిన జీ-20 సదస్సులో వివిధ దేశాల అధ్యక్షులు కోటుకు అలంకరించుకునేందుకు అశోకచక్రంతో కూడిన బ్యాడ్జీలను కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులే తయారు చేసి పంపించారు. ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ, నీతా దంపతుల కుమారుడు అనంత్ అంబానీ వివాహం సందర్భంగా ఫిలిగ్రీ కళాఖండాలు 400 వస్తువులకు పైగా పంపిణీ కాబడటం విశేషం.
మెలోనికి ముగా సిల్క్ స్టూల్ బహుకరణ
ప్రధానమంత్రి మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి ఒక ముగా సిల్క్ స్టోల్‌ను బహుమతిగా ఇచ్చారు. అస్సాం యొక్క “గోల్డెన్ సిల్క్”గా ప్రసిద్ధి చెందిన ముగా సిల్క్, ఈశాన్య భారతదేశంలోని బ్రహ్మపుత్ర లోయ నుండి లభించే ఒక అరుదైన, ప్రతిష్టాత్మకమైన వస్త్రం. సహజమైన బంగారు వర్ణానికి, నిరాడంబరమైన సొగసుకు ప్రసిద్ధి చెందిన ఈ అద్భుతమైన పట్టు వస్త్రం కృత్రిమ రంగులు లేకుండా ఉత్పత్తి చేయబడుతుంది. ప్రపంచంలోని అత్యంత బలమైన సహజ ఫైబర్‌లలో ఒకటిగా పేరుగాంచిన ముగా సిల్క్ అద్భుతమైన వస్త్రంగానే కాకుండా, దీర్ఘకాలం మన్నికకు గుర్తింపు పొందింది.
UAE క్వీన్ మదర్‌కు కరీంనగర్ ఫిలిగ్రీ బాక్స్ కానుక
🔹UAE క్వీన్ మదర్ షేకా ఫాతిమాకు ప్రధాని నరేంద్ర మోదీ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ బాక్స్, మహేశ్వరి సిల్క్ వస్త్రాన్ని బహుమతిగా ఇచ్చారు.
🔹 తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ అరుదైన వెండి నగిషీ (నక్షీ) పెట్టె భారతీయ హస్తకళల… pic.twitter.com/wwJ3HfyHpm— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) May 21, 2026
ఇవి కూడా చదవండి :
జార్ఖండ్ లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు
బీజేపీని దాటిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఫాలోవర్స్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram