Giant Python In Drainage : డ్రైనేజీలో భారీ కొండచిలువ..వైరల్ వీడియో
భీమవరం యనమదుర్రులో డ్రైనేజీ కాలువ నుంచి 20 అడుగుల పొడవుగల కొండచిలువ బయటకు వచ్చింది. అటవీ శాఖ సిబ్బంది దానిని బంధించి తరలించారు.
విధాత: డ్రైనేజీ కాలువ నీటిని పొలానికి తరలిస్తున్న క్రమంలో ఓ భారీ కొండ చిలువ ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రులో భారీ కొండచిలువ స్థానికులను భయపెట్టింది. గ్రామంలో స్థానికంగా ఉన్న ఓ డ్రైనేజీ కాలువలో నుంచి పొలంలోకి ఇంజిన్ ద్వారా నీటిని తోడుతున్న సమయంలో భారీ కొండచిలువ సడెన్ గా బయటకు వచ్చింది.
దాన్ని చూసిన స్థానికులు వెంటనే అక్కడి నుంచి దూరంగా జరిగారు. కొండచిలువ సుమారు 20 అడుగుల పొడవుగా ఉందని వారు వెల్లడించారు. దానిని చూసేందుకు వచ్చిన స్థానికుల హడావుడిని గమనించి కొండ చిలువ నెమ్మదిగా డ్రైనేజీ పైపులో దూరిపోయింది.
భారీ కొండ చిలువ సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలికి వచ్చి డ్రైనేజీ పైపులో దూరిన కొండచిలువను బంధించేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరకు ఆ భారీ కొండచిలువను బంధించి అటవీ ప్రాంతానికి తరలించారు.
డ్రైనేజీలో భారీ కొండచిలువ
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రులో కొండచిలువ కలకలం
గ్రామంలో స్థానికంగా ఉన్న ఓ డ్రైనేజీ కాలువలో నుంచి పొలంలోకి ఇంజిన్ ద్వారా నీటిని తోడుతున్న సమయంలో భారీ కొండచిలువ ప్రత్యక్షం
కొండచిలువ సుమారు 20 అడుగుల పొడవు ఉంటుందని చెబుతున్న గ్రామస్తులు… pic.twitter.com/nNLXqPqvAG
— ChotaNews App (@ChotaNewsApp) December 15, 2025
ఇవి కూడా చదవండి :
CPI Narayana : ఎంపీ ఆర్ కృష్ణయ్యపై సీపీఐ నారాయణ ఆగ్రహం
MLA Sanjay Kumar : జగిత్యాల ఎమ్మెల్యే ఓ యూజ్ లెస్ ఫెలో
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram