CPI Narayana : ఎంపీ ఆర్ కృష్ణయ్యపై సీపీఐ నారాయణ ఆగ్రహం

బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య నాటకాలు ఆడుతున్నారంటూ సీపీఐ నారాయణ మండిపడ్డారు. బీసీ ఉద్యమానికి నిజమైన మద్దతు ఇవ్వాలి.

CPI Narayana : ఎంపీ ఆర్ కృష్ణయ్యపై సీపీఐ నారాయణ ఆగ్రహం

విధాత : బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ఎంపీగా ఉన్న ఆర్.కృష్ణయ్య నాటకాలు వేస్తున్నారంటూ సీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు నారాయణ మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేసి పంపిస్తే కేంద్రం అడ్డుకుంటుందన్నారు. నేను బీసీని అని చెప్పుకునే ప్రధాని మోదీ ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నారు? అని నారాయణ ప్రశ్నించారు. బీజేపీ తరపున ఎంపీగా ఉన్న ఆర్. కృష్ణయ్య బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై ఎందుకు నాటకాలు ఆడుతున్నారు? అని నారాయణ నిలదీశారు. బీజేపీ సంకలో ఉండి బీసీ ఉద్యమానికి కృష్ణయ్య న్యాయం చేయడం లేదు అన్నారు.

పార్లమెంట్ లో ఉన్న కృష్ణయ్య బీసీ ఉద్యమానికి మద్దతు తెలిపే పార్టీలను, నాయకులను ఎందుకు కలిసి ఎందుకు ఏకతాటిపైకి తీసుకురావడం లేదు? అని ప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యులతో కలిసి ధర్నా చేస్తే సీపీఐ కూడా మద్దతు ఇస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై శాసనాలు చేయాల్సిన పార్లమెంటు వేదికపై బీజేపీ ఎంపీగా కృష్ణయ్య చేయాల్సింది చేయకుండా దేశమంతా తిరుగుతామంటూ ప్రజలను మభ్యపెట్టడం ఎందుకన్నారు.

మండల్ కమిషన్ వ్యవహారంలో వీపీసింగ్ ను గద్దె దించిన బీజేపీ ఎప్పటికి బీసీ రిజర్వేషన్ చేయబోదని నారాయణ దుయ్యబట్టారు. బీసీ రిజర్వేషన్లపై ఆత్మవంచన చేసుకోకుండా కృష్ణయ్య సహా తమ పోరాటాలు కొనసాగించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి :

Pawan Kalyan | ఓజీ ద‌ర్శ‌కుడికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంత ఖ‌రీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చాడా.. సుజీత్ ఆనందానికి అవ‌ధులు లేవు
MLA Sanjay Kumar : జగిత్యాల ఎమ్మెల్యే ఓ యూజ్ లెస్ ఫెలో