Pawan Kalyan | ఓజీ ద‌ర్శ‌కుడికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంత ఖ‌రీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చాడా.. సుజీత్ ఆనందానికి అవ‌ధులు లేవు

Pawan Kalyan | దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రియాంక మోహన్ కథానాయికగా నటించగా, తమన్ సంగీతం అందించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2025 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయినప్పటి నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిన ఈ సినిమా, పవన్ ఫ్యాన్స్‌కు నిజమైన పండుగగా మారింది.

  • By: sn |    movies |    Published on : Dec 16, 2025 1:56 PM IST
Pawan Kalyan | ఓజీ ద‌ర్శ‌కుడికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంత ఖ‌రీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చాడా.. సుజీత్ ఆనందానికి అవ‌ధులు లేవు

Pawan Kalyan | దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రియాంక మోహన్ కథానాయికగా నటించగా, తమన్ సంగీతం అందించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2025 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయినప్పటి నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిన ఈ సినిమా, పవన్ ఫ్యాన్స్‌కు నిజమైన పండుగగా మారింది. పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన నటుడిని ఏ రూపంలో చూడాలనుకున్నారో దర్శకుడు సుజీత్ అదే స్థాయిలో ఆవిష్కరించాడనే ప్రశంసలు అందాయి. స్టైలిష్ ప్రెజెంటేషన్, పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, మాస్ ఎలివేషన్లతో ‘ఓజీ’ వసూళ్ల వర్షం కురిపించింది. ఈ విజయంతో దర్శకుడు సుజీత్ పేరు మరోసారి టాలీవుడ్‌లో బలంగా నిలిచింది.

ఖ‌రీదైన గిఫ్ట్‌

ఇదిలా ఉండగా, తనకు ఈ ఘన విజయాన్ని అందించిన దర్శకుడికి పవన్ కళ్యాణ్ తాజాగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. సుజీత్‌కు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా అందించారు. పవన్ స్వయంగా ఈ కారును సుజీత్‌కు అందించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ విషయాన్ని దర్శకుడు సుజీత్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. “నా జీవితంలో ఇదే అత్యుత్తమ బహుమతి. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది” అంటూ పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ కారు కొన్ని కోట్లు ఉంటుంద‌ని అంటున్నారు. ప్రస్తుతం ఈ కారుతో దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, పవన్ ఫ్యాన్స్‌తో పాటు సినీ పరిశ్రమ నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

పవన్ కళ్యాణ్ విజయాన్ని మాత్రమే కాదు, తన టీమ్ కృషిని కూడా ఇలాగే గౌరవించే వ్యక్తిత్వానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలుస్తోంది. ‘ఓజీ’ విజయంతో పాటు ఈ గిఫ్ట్ వ్యవహారం కూడా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రంపై కూడా అంచ‌నాలు భారీ స్థాయిలో ఉండ‌గా, ఈ సినిమా నుండి ఇటీవ‌ల విడుద‌లైన సాంగ్ మూవీపై మరింత అంచ‌నాలు పెంచింది. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌కి ఈ మూవీ రిలీజ్ కానున్న‌ట్టు తెలుస్తుంది.