కంటైనర్‌లో ఆవుల అక్రమ తరలింపు.. ఊపిరాడక 16 ఆవుల మృతి
పల్నాడు జిల్లా గురజాల నుంచి కంటైనర్‌లో అక్రమంగా ఆవులను తరలిస్తున్న క్రమంలో ఊపిరాడక 16 అవులు మృత్యువాత పడ్డాయి.
విధాత : పల్నాడు జిల్లా గురజాల నుంచి కంటైనర్‌లో అక్రమంగా ఆవులను తరలిస్తున్న క్రమంలో ఊపిరాడక 16 అవులు మృత్యువాత పడ్డాయి. సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం మట్టపల్లి చెక్ పోస్టు వద్ధ మంగళవారం ఉదయం కంటైనర్‌లో తరలిస్తున్న 26 ఆవులను పోలీసులు పట్టుకున్నారు. అక్రమ రవాణాదారులు పోలీసులతో సెటిల్మెంట్ చేసుకోవడం కుదరక పోవడంతో ఆవులు గంటల తరబడి కంటైనర్‌లోనే ఉండిపోగా, ఊపిరాడక పోవడంతో వాటిలో 16ఆవులు చనిపోయాయి.
మిగతా వాటిని నల్లగొండ గోశాలకు తరలించారు. ఎఫ్‌ఐఆర్ చేయడంలో ఎస్ఐ రామాంజనేయులు నిర్లక్ష్యం వల్లనే 16 ఆవులు చనిపోయాయని సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్పీ రాహుల్ హెగ్డే పోలీసుల తీరుపై విచారణకు ఆదేశించారు. ఆవులను అక్రమ రవాణ చేస్తున్న నలుగురు తమిళనాడు వాసులపై కేసు నమోదు చేశారు. మృతి చెందిన ఆవులకు పశువైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram