జగ్గయ్యపేట పట్టణంలో విచిత్ర సంఘటన.
తన భార్య పోలికలతో ఉన్న మరో మహిళ మృతదేహాన్ని తన భార్య అనుకోని అంత్యక్రియలు నిర్వహించిన భర్త. భార్య తిరిగి రావడంతో అవాక్కైన భర్త స్థానికులు విధాత:జగ్గయ్యపేట పట్టణంలో క్రిస్టియన్ పేట లోని కొలిమి బజార్ లో ఉన్న ముత్యాల గిరిజమ్మ కు మే 12 న కరోనా పాజిటివ్ రావడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. మే 15న గిరిజమ్మ భర్త గడ్డియ్యా తన భార్యను చూడడానికి ఆస్పత్రికి వెళ్లగా ఆమె కనపడక పోవడంతో […]

తన భార్య పోలికలతో ఉన్న మరో మహిళ మృతదేహాన్ని తన భార్య అనుకోని అంత్యక్రియలు నిర్వహించిన భర్త.
భార్య తిరిగి రావడంతో అవాక్కైన భర్త స్థానికులు
విధాత:జగ్గయ్యపేట పట్టణంలో క్రిస్టియన్ పేట లోని కొలిమి బజార్ లో ఉన్న ముత్యాల గిరిజమ్మ కు మే 12 న కరోనా పాజిటివ్ రావడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
మే 15న గిరిజమ్మ భర్త గడ్డియ్యా తన భార్యను చూడడానికి ఆస్పత్రికి వెళ్లగా ఆమె కనపడక పోవడంతో అక్కడ ఉన్న వైద్యులను అడగగా చనిపోయి ఉంటుందేమోనని మార్చురీలో చూడమనగా అదే పోలికలతో ఉన్న మరొక మహిళ మృతదేహాన్ని చూసి తన భార్య అనుకొని హాస్పటల్ సిబ్బంది చెప్పగా వారు మృతదేహాన్ని గడ్డియ్య కు అప్పజెప్పి నారు.
అదేరోజు మృతదేహాన్ని జగ్గయ్యపేట ఇంటి వద్దకు తీసుకుని వచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు.
కాగా గిరిజమ్మ కొడుకు రమేష్ కు మే 19న కరోనా సోకడంతో ఖమ్మం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా మే 23 న మృతి చెందాడు.
జూన్ 2 బుధవారం గిరి జమ్మ హఠాత్తుగా క్రిస్టియన్ పేట తన ఇంటి వద్ద ప్రత్యక్షం కావడంతో స్థానికులు అవాక్కయ్యారు.
చుట్టుపక్కల వారు ఆమెను వివరాలు అడగ్గా తాను విజయవాడ హాస్పటల్ లో చికిత్స పొందుతూ అక్కడే ఉన్నానని తన కోసం ఎవరూ రాకపోవడంతో వైద్యులకు విషయం తెలియజేయగా వారు ప్రత్యేకంగా ఒక ఆటోను మాట్లాడి ఇంటికి పంపించారు అని తెలిపింది.
గిరిజన భర్త గడ్డియ్య తన భార్య పోలికలతో ఉన్న మరో మహిళ మృతదేహాన్ని తన భార్య అనుకొని భ్రమ పడటం తో ఇదంతా జరిగినట్లు స్థానికులు అనుకుంటున్నారు.