Corona Cases: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు!

విధాత : దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం వెల్లడించిన గణంకాల మేరకు 2,700 కోవిడ్ కేసులు, ఏడు మరణాలు నమోదయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది. కేరళ-1,147, మహారాష్ట్ర-424, ఢిల్లీ-294 కేసులు నమోదయినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మే 26వ తేదీన దేశవ్యాప్తంగా 1010కరోనా కేసులు నమోదు కాగా, కేవలం నాలుగు రోజుల వ్యవధిలో 2,710కరోనా యాక్టివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు దేశంలో చనిపోయిన ఏడుగురిలో మహారాష్ట్రలో ఇద్దరు మృతిచెందగా, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలలో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారు.
కరోనా కొత్త వేరియంట్ లక్షణాలతో మృతి చెందిన వారు ఎక్కువ మంది వృద్ధులే కావడం గమనార్హం. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్నటువంటి కొత్త వేరియంట్ జేఎన్ వన్ వేరియంట్ గా చెబుతున్నారు. ఈ వేరియంట్ కారణంగా జ్వరం, గొంతు నొప్పి , తలనొప్పి, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఆకలి లేకపోవడం. వికారం, విపరీతమైన అలసట. జీర్ణాశయ సమస్యలు వంటి లక్షణాలు వస్తాయని చెబుతున్నారు.