Corona Cases: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases: : దేశంలో కరోనా వైరస్ విస్తరణ రోజు రోజుకి పెరుగుతుంది. తాజా లెక్కల మేరకు కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 5000 దాటింది. ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 5364 చేరింది. కేరళలో అత్యధికంగా 1679 ఆక్టివ్ కేసులు ఉండగా.. గుజరాత్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ తర్వాత స్థానంలో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో 498 కొత్త కేసులు నమోదవ్వగా.. నలుగురు మరణించారు. మరణించిన వారిలో ఇద్దరు కేరళ, పంజాబ్, కర్ణాటకలలో ఒకొక్కరు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా వైరస్ తో 55 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని..వ్యాధి లక్షణాలు ఉన్నవారు సకాలంలో సరైన చికిత్స తీసుకోవాలని సూచించింది.