Corona Cases: దేశంలో 6వేలు దాటిన కరోనా కేసులు !
Corona Cases: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం నాటికి దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 6,133కు చేరింది. గడిచిన 24 గంటల్లో 378 కొత్త కేసులు నమోదుకాగా, కోవిడ్ కారణంగా ఆరుగురు మరణించారు. కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, తమిళనాడులో ఒకరు కరోనా వల్ల మృతి చెందారు. ఇప్పటివరకు కోవిడ్ బారినపడి చనిపోయినవారి సంఖ్య 65కి చేరింది. కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కేరళలో ఒక్క రోజులోనే 144కేసులు నమోదయ్యాయి. గుజరాత్ రాష్ట్రంలో కొత్తగా 105 మందికి వ్యాధి సోకింది.
ఏపీలో 86, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులను గుర్తించిన ఆరోగ్య శాఖ గుర్తించింది.గుజరాత్ రాష్ట్రంలో కొత్తగా 105 మందికి వ్యాధి సోకింది. కరోనా వైరస్ విస్తరించకుండా అని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram