Corona Virus: కరోనా విస్తరణ..దేశవ్యాప్తంగా పెరిగిన కేసులు!

నిన్న ఒక్కరోజే 685 కోవిడ్ పాజిటివ్ కేసులు
3,395 కు చేరిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య
న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ కరోనా వైరస్ విస్తరణ కొనసాగుతుంది. రోజురోజుకు కరోనా కేసుల నమోదు పెరిగిపోతుంది. దేశంలో 3,395కు యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజునే 685కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 రాష్ట్రాలలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీలో 375, గుజరాత్‌లో 265, కర్ణాటకలో 254, కేరళలో 1336, మహారాష్ట్రలో 467, తమిళనాడులో 185, వెస్ట్ బెంగాల్‌లో 205, ఉత్తరప్రదేశ్‌లో 117 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కోవిడ్‌తో నలుగురు మృతి చెందారు. యూపీ, ఢిల్లీ, కర్ణాటక కేరళలో ఒక్కొక్కరు మృతి చెందారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కోవిడ్ తో 26 మంది మృతి చెందారు. కోవిడ్ బారిన పడిన వారిలో 1435 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఎక్కువగా ఒమిక్రాన్ జెఎన్ వేరియంట్ ఎల్ ఎఫ్ 7 కేసులు వెలుగుచూస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కరోనా కలకలం రేపింది. పాల్వంచ కేటీపీఎస్ కర్మాగారంలో సిబ్బంది ఒకరికి కరోనా సోకికనట్లుగా కేటీపీఎస్ హాస్పిటల్ వైద్యులు నిర్థారించారు. రద్దీ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు మాస్కులు ధరించాలని, కరోనా వైరస్ సోకకుంగా అన్ని జాగ్రత్తలు వాడాలని, వైరస్ సోకిన వారు సకాలంలో చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.