KCR: మరోసారి కేసీఆర్ కు ఆరోగ్య పరీక్షలు!

KCR: మరోసారి కేసీఆర్ కు ఆరోగ్య పరీక్షలు!

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వరుసగా రెండోరోజు ఏఐజీ ఆసుపత్రికి ఆరోగ్య పరీక్షల కోసం వచ్చారు. కేసీఆర్‌ వెంట కేటీఆర్‌, హరీష్‌రావు, సంతోష్ రావులు సైతం ఆసుపత్రికి వచ్చారు. హెల్త్ చెకప్ లో భాగంగా నిన్న కొన్ని టెస్టులు చేసుకున్న కేసీఆర్..శనివారం మరిన్ని టెస్టుల కోసం మరోసారి ఆస్పత్రికి వచ్చారు. ఏఐజీ ఆస్పత్రిలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. సాధారణ, గ్యాస్ట్రిక్ పరీక్షలు చేశామని వైద్యులు తెలిపారు.కొన్నిరోజులుగా కేసీఆర్ జలుబు, ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ తిరిగి నందినగర్ నివాసానికి లేదా.. ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ కు వెళ్లిపోనున్నారు.