Covid Cases: కొవిడ్ తీవ్రరూపం.. తాజా కేసులు ఎన్నో తెలుసా?

Covid Cases: కొవిడ్ తీవ్రరూపం.. తాజా కేసులు ఎన్నో తెలుసా?

Covid Cases:  దేశ‌వ్యాప్తంగా కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు కొవిడ్ భారిన ప‌డ్డ వారిసంఖ్య 6 వేలు దాటింద‌ని వైద్య‌శాఖ అధికారులు చెప్పారు. క‌రోనా కార‌ణంగా మొత్తం 65 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం 6,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 378 కేసులు న‌మోద‌య్యాయి.

కేర‌ళ‌లో క‌రోనా తీవ్ర‌రూపం దాల్చుతున్న‌ది. ఆ రాష్ట్రంలో అత్య‌ధికంగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. 1950 యాక్టివ్‌ కేసులు ఉండగా.. గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, దిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

డేటాబోర్డులో వెల్లడించిన సమాచారం ప్రకారం.. కేరళలో అత్యధికంగా 1950 కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌ 822, పశ్చిమబెంగాల్ 693, దిల్లీ 686, మహారాష్ట్ర 595, కర్ణాటక 366, ఉత్తరప్రదేశ్‌ 219, తమిళనాడు 194, తెలంగాణ 10, ఆంధ్రప్రదేశ్ 86 కేసులు న‌మోద‌య్యాయి.