COVID-19 | దేశంలో కరోనా టెర్రర్..! 10వేలకుపైగా కొత్త కేసులు.. ఆందోళనలో జనం..!
COVID-19 | దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. రోజురోజుకు వైరస్ ఉధృతి పెరుగుతున్నది. నిన్న 7వేలకుపైగా రికార్డవగా.. తాజాగా 10వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 30శాతం కేసులు పెరిగాయి. దాంతో మరోసారి ఆంక్షలు తప్పవా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,158 కొత్త కేసులు వెలుగు చూశాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో మొత్తం యాక్టివ్ కేసులు 44,998కి పెరిగాయని చెప్పింది. దాదాపు […]

COVID-19 | దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. రోజురోజుకు వైరస్ ఉధృతి పెరుగుతున్నది. నిన్న 7వేలకుపైగా రికార్డవగా.. తాజాగా 10వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 30శాతం కేసులు పెరిగాయి. దాంతో మరోసారి ఆంక్షలు తప్పవా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,158 కొత్త కేసులు వెలుగు చూశాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో మొత్తం యాక్టివ్ కేసులు 44,998కి పెరిగాయని చెప్పింది. దాదాపు 230 రోజుల తర్వాత భారీగా కేసులు నమోదవడం ఇదే తొలిసారని పేర్కొంది. మహారాష్ట్ర, ఢిల్లీలో బుధవారం కొత్త కేసులు వెయ్యి మార్క్‌ను దాటాయి.
దేశ రాజధానిలో 1149 నమోదవగా పాజిటివిటీ రేటు 23.8శాతానికి పెరిగింది. మరో వైపు మహారాష్ట్రలో 1,115 కేసులు రికార్డయ్యాయి. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,42,10,127కి చేరుకుంది. రోజువారి పాజిటివిటీ రేటు 4.42శాతం నమోదు కాగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 4.02శాతంగా నమోదైంది. రికవరీ రేటు 98.71శాతం ఉందని, మరణాలు రేటు 1.19శాతం ఉందని తెలిపింది. అయితే, దేశంలో కొవిడ్ స్థానిక దశకు చేరుకుందని, రాబోయే 10-12 రోజుల్లో కేసులు పెరుగుతాయని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతూ వస్తుందని నిపుణులు పేర్కొన్నారు. వేరియంట్‌కు కారణం ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ.1.16 కారణమని తెలిపారు.