ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను వేగవంతం చేయండి.. సిఎస్ ఆదిత్యానాథ్‌ దాస్‌

విధాత,అమరావతి:రాష్ట్రంలో మంజూరైన 7 ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ ఆదేశించారు. నూతనంగా మంజూరైన ఫిషింగ్ హార్బర్లపై హైలెవల్ కమిటీ సమావేశం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో సిఎస్ అధ్యక్షతన సోమ‌వారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా మంజూరైన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేసిన నేపథ్యంలో ఇప్పటికే మొదటి దశ కింద చేపట్టిన ఫిషింగ్ హార్బర్ల […]

ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను వేగవంతం చేయండి.. సిఎస్ ఆదిత్యానాథ్‌ దాస్‌

విధాత,అమరావతి:రాష్ట్రంలో మంజూరైన 7 ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ ఆదేశించారు. నూతనంగా మంజూరైన ఫిషింగ్ హార్బర్లపై హైలెవల్ కమిటీ సమావేశం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో సిఎస్ అధ్యక్షతన సోమ‌వారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా మంజూరైన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేసిన నేపథ్యంలో ఇప్పటికే మొదటి దశ కింద చేపట్టిన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేయాల‌ని సీఎస్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీల అధికారులను ఆదేశించారు.

పిషింగ్ హార్బర్ల నిర్మాణానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే అప్పగించడంతో పాటు మిగతా అవసరమైన భూమిని త్వరితగతిన సేకరించాలని వీడియో సమావేశం ద్వారా పాల్గొన్న సంబంధిత కలెక్టర్లను ఆదేశించారు. వీటి నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై సిఎస్ కమిటీ సభ్యులు అధికారులతో సమీక్షించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్, మత్స్య శాఖ కమిషనర్ కన్నబాబు, ఆర్థిక శాఖ ఈవో కార్యదర్శి సత్యనారాయణ, మైనార్టీ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇంతియాజ్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.