విధాత: అనంతపురం జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో సారథ్యంలో ఇసుక అక్రమ రవాణ, అక్రమ మద్యంపై జులై నెలలో విస్తృతంగా దాడులు కొనసాగాయి. కర్నాటక రాష్ట్రం నుండీ జిల్లాలోకి అక్రమంగా మద్యం రవాణా చేయకుండా… జిల్లాలో నాటు సారా తయారీ, విక్రయాలపై పటిష్ట చర్యలు తీసుకున్నారు. వీటితో పాటు ఇసుక అక్రమ రవాణాపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో బృందాలు…పోలీసు బలగాలు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆదేశాలు మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో స్పెషల్ ఆఫీసర్ జె.రామమోహనరావు పర్యవేక్షణలో పోలీసు బృందాలు జులై నెలలో నాటు సారా తయారీదారులు, విక్రేతలు మరియు మద్యం అక్రమ రవాణాదారులు నిరంతరం నిఘా వేశారు. జిల్లాలోకి అక్రమంగా కర్నాటక మద్యం రవాణా చేస్తుండటంపై దాడులు నిర్వహించి 1,01,486 టెట్రా పాకెట్లు, 2,052 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కర్నాటక నుండీ జిల్లాలోకి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న వారిపై 861 కేసులు నమోదు చేసి 1,163 మంది నిందితులను అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా నాటు సారా స్థావరాలు, విక్రయాలపై దాడులు నిర్వహించి 41,075 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం చేశారు. 3,748 లీటర్ల నాటు సారా, 940 కిలోల సారా తయారీకీ వినియోగించే బెల్లం స్వాధీనం చేసుకున్నారు.
ఇసుక అక్రమ రవాణాపై కూడా నిరంతరం నిఘా వేశారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి 81 కేసులు నమోదు చేసి 156 మంది అరెస్టు చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 103 వాహనాలు పట్టుకుని 439.5 టన్నుల ఇసుక సీజ్ చేశారు.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో సారథ్యంలో జులై నెలలో జరిగిన దాడులు
<p>విధాత: అనంతపురం జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో సారథ్యంలో ఇసుక అక్రమ రవాణ, అక్రమ మద్యంపై జులై నెలలో విస్తృతంగా దాడులు కొనసాగాయి. కర్నాటక రాష్ట్రం నుండీ జిల్లాలోకి అక్రమంగా మద్యం రవాణా చేయకుండా… జిల్లాలో నాటు సారా తయారీ, విక్రయాలపై పటిష్ట చర్యలు తీసుకున్నారు. వీటితో పాటు ఇసుక అక్రమ రవాణాపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో బృందాలు…పోలీసు బలగాలు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆదేశాలు మేరకు స్పెషల్ […]</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు