అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

విధాత‌: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది.NH44 హైదరాబాద్ టు బెంగుళూరు హైవే పైన పామిడి సమీపాన పంజాబీ డాబా వద్ద కూలీలు ప్ర‌యాణిస్తున్న‌ ఆటోను లారీ ఢీకొట్టడంతో అక్కడక్కడే 5మంది మృతి చెందగా పలువురు తీవ్ర‌గాయాల పాల‌య్యారు.బాదితులు గార్లదిన్నె మండలం కోప్పలకొండ గ్రామానికి చెందిన వారుగా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సంఘటన పట్ల గవర్నర్ సంతాపం అనంతపురం జిల్లా పామిడి జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన […]

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

విధాత‌: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది.NH44 హైదరాబాద్ టు బెంగుళూరు హైవే పైన పామిడి సమీపాన పంజాబీ డాబా వద్ద కూలీలు ప్ర‌యాణిస్తున్న‌ ఆటోను లారీ ఢీకొట్టడంతో అక్కడక్కడే 5మంది మృతి చెందగా పలువురు తీవ్ర‌గాయాల పాల‌య్యారు.బాదితులు గార్లదిన్నె మండలం కోప్పలకొండ గ్రామానికి చెందిన వారుగా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ప్రమాద సంఘటన పట్ల గవర్నర్ సంతాపం

అనంతపురం జిల్లా పామిడి జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమా దంలో ఆరుగురు మహిళలు మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కూలీలను తీసుకెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఆరుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాల పాలయ్యారు.

సంఘటన పూర్వాపరాలను అధికారుల నుండి తెలుసుకున్న గవర్నర్‌ హరిచందన్ గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.