ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయండి
కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి విద్యార్థి,యువజన సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ బైక్ ర్యాలీను అడ్డగించి విద్యార్థి, యువజన సంఘాల నాయకులను అరెస్టు చేసిన పోలీసులు, ఉద్యోగాలు అడిగితే అరెస్టులా అనంతపురం,విధాత: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల భర్తీ కొరకు కొత్త జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని సోమవారం నాడు నగరంలో విద్యార్థి,యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ వద్ద నుండి ప్రారంభిస్తున్న బైక్ ర్యాలీని పోలీసులు అడ్డగించి నాయకులను పోలీస్ స్టేషన్కు […]

- కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి
- విద్యార్థి,యువజన సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
- బైక్ ర్యాలీను అడ్డగించి విద్యార్థి, యువజన సంఘాల నాయకులను అరెస్టు చేసిన పోలీసులు,
- ఉద్యోగాలు అడిగితే అరెస్టులా
అనంతపురం,విధాత: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల భర్తీ కొరకు కొత్త జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని సోమవారం నాడు నగరంలో విద్యార్థి,యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ వద్ద నుండి ప్రారంభిస్తున్న బైక్ ర్యాలీని పోలీసులు అడ్డగించి నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది, ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మనోహర్, ఏ ఐ వై ఎఫ్ సంతోష్, ఎన్ ఎస్ యు ఐ పులి రాజు , తెలుగు యువత నారాయణస్వామి, టిఎన్ఎస్ఎఫ్ ధనంజయ నాయుడు, పిడిఎస్ యు వీరేంద్ర మాట్లాడుతూ ఉద్యోగాలు ఇవ్వడం చేతకాక పోలీసుల చేత అరెస్టు చేయించడం వైసీపీ ప్రభుత్వం యొక్క చేతగానితనమే అని పేర్కొన్నారు, రాష్ట్రంలో లక్షల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉంటే భర్తీ నోటిఫికేషన్ మాత్రం వందల్లో విడుదల చేయడం అత్యంత హాస్యాస్పదమన్నారు, నీరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కొరకు దశలవారీ ఆందోళనలు జరుగుతున్నప్పటికీ దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఈ వైసీపీ ప్రభుత్వం వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు,ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం,ప్రజాస్వామ్య స్వేచ్ఛను హరించే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు, రాష్ట్ర ప్రజలకు జవాబు దారిగా పనిచేయాల్సిన రాష్ట్రప్రభుత్వం నియంతృత్వ పోకడలతో పిచ్చి తుగ్లక్ పాలనలాగా నడుస్తోందని ఎద్దేవా చేశారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని గొప్పలు పలికి వారి ఓట్లతో అధికారం చేపట్టిన అనంతరం వారి జీవితాలను విచ్ఛిన్నం చేసే విధంగా వ్యవహరిస్తోందన్నారు, కనీసం శాంతియుతంగా జరిగేటువంటి బైక్ ర్యాలీ కూడా జరగనివ్వకుండా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని లేనిపక్షంలో భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చేపడతామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాజేంద్ర, ఏ ఐ వై ఎఫ్ ఆనంద్, టిఎన్ఎస్ఎఫ్ జగదీష్, విద్యార్థి యువజన సంఘాల నాయకులు చిరంజీవి,వీరు యాదవ్, రమణ, రాము, శ్రీనాథ్, మల్లికార్జున, లోకేష్, విజయ్, మోహన్, హరి, ఉమా మహేష్, మంజు, వంశీ, రుద్ర,వినయ్, తదితరులు పాల్గొన్నారు