Site icon vidhaatha

Alekhya Chitti Pickles | ఐసీయూలో.. పచ్చళ్ల అలేఖ్య!

విధాత: వినియోగదారుడితో అనుచిత వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్నఅలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురు అక్కాచెల్లె ళ్లను సోషల్ మీడియాలో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అలేఖ్య ఆస్పత్రి ఐసీయూలో ఉన్న వీడియోను ఆమె సోదరి సుమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ట్రోలింగ్ ను తట్టుకోలేక ఆమె ఆరోగ్య పరిస్థితి దారుణంగా తయారైందని అందుకే ఆస్పత్రిలో చేర్పించినట్లుగా సుమ తెలిపింది.

ప్రస్తుతం ఆక్సిజన్ తీసుకునే పరిస్థితిలో కూడా తన సోదరి లేదని ఆవేదన వ్య క్తం చేసింది. ఇకనైనా తమ ఫ్యామిలీ పైన ట్రోలింగ్ ఆపాలని వేడుకున్నది. తమకు పచ్చళ్ల వ్యాపారం, యూట్యూ బ్ వద్దంటూ స్పష్టం చేసింది. మరోవైపు ఆలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంపై హీరోయిన్ మాధవీలత స్పందించింది. ఆలేఖ్య సిస్టర్స్ ను ట్రోల్ చేస్తున్న వారికి ఆమె కౌంటర్ ఇచ్చింది. చైనా, జపాన్ వాడు ఏదేదో కనిపెడుతుంటే మన యువత పచ్చళ్ల గురించి మాట్లాడుతున్నారని..పనికొచ్చే పనిచేయమంటూ పచ్చళ్ల పాపల వెంట పడటం ఎందుకని చురకలేసింది.

Exit mobile version