రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులు..క్యాబినెట్‌ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు శుక్ర‌వారం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన మంత్రి వ‌ర్గ స‌మావేశం కీల‌క నిర్ణ‌యాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాబినెట్ నిర్ణ‌యాల‌ను మంత్రి పార్థ సార‌థి మీడియాకు వెల్ల‌డించారు

రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులు..క్యాబినెట్‌ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి
  • రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులు
  • 4 గ్రేడ్లుగా గ్రామపంచాయతీల విభజన
  • విశాఖలో 3 డాటా సెంటర్ల ఏర్పాటు
  • క్యాబినెట్‌ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి

అమరావతి : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు శుక్ర‌వారం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన మంత్రి వ‌ర్గ స‌మావేశం కీల‌క నిర్ణ‌యాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాబినెట్ నిర్ణ‌యాల‌ను మంత్రి పార్థ సార‌థి మీడియాకు వెల్ల‌డించారు. ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు ఆమోదం తెలిపిన‌ట్లు వివ‌రించారు. అలాగే 70 వేల ఉద్యోగాలు కల్పించే పెట్టుబడులకు ఓకే చెప్పారు. పర్యాటక అభివృద్ధి కోసం పలు పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దేశంలో అతిపెద్ద డాటా సెంటర్ విశాఖలోని మూడు ప్రాంతాల్లో రూ.87 వేల కోట్లతో ఏర్పాటుకు ఆమోదం. దొనకొండ వద్ద రూ.1200 కోట్లతో ఏర్పాటు చేయబోయే బీడీఎల్ ఫ్యాక్టరీకి అనుమతి. అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్‌భవన్‌ నిర్మాణం, గూగుల్ డాటా సెంటర్‌కు 480 ఎకరాల కేటాయింపునకు అనుమతి ఇస్తూ ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ్రామ పంచాయతీల పునఃవర్గీకరణ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. ఈ మేర‌కు క్యాబినెట్‌లో నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చాల‌ని నిర్ణ‌యించామ‌ని చెప్పారు. ఈ మేర‌కు 13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మారుస్తామ‌ని తెలిపారు. ఆదాయాన్ని బట్టి పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు వెల్లడించారు. పంచాయతీ సెక్రటరీలను.. పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా మారుస్తూ క్యాబినెట్ నిర్ణ‌యం తీసుకున్న‌దని మంత్రి పార్థసారథి వివరించారు.