Supreme Court | సుప్రీంకోర్టులో జేపీ వెంచర్స్‌కు చుక్కెదురు.. రూ.18 కోట్ల జరిమానా కట్టాల్సిందేగా..!

Supreme Court | ఆంధప్రదేశ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపిన జేపీ వెంచర్స్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన రూ.18 కోట్ల జరిమానా నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ జేపీ వెంచర్స్‌ చేసిన విజ్ణప్తిని సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది.

Supreme Court | సుప్రీంకోర్టులో జేపీ వెంచర్స్‌కు చుక్కెదురు.. రూ.18 కోట్ల జరిమానా కట్టాల్సిందేగా..!

Supreme Court : ఆంధప్రదేశ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపిన జేపీ వెంచర్స్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన రూ.18 కోట్ల జరిమానా నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ జేపీ వెంచర్స్‌ చేసిన విజ్ణప్తిని సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. దాంతో జేపీ వెంచర్స్‌ జరిమానా కట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణను కోర్టు ఆగస్టు 31కి వాయిదా వేసింది.

ఆ లోపు అదనపు అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూలై 30న ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను క్షణ్ణంగా పరిశీలించి ఏం చేయాలన్నది ఆదేశిస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. వరదల కారణంగా అక్రమ ఇసుక తవ్వకాల ఆనవాళ్లు కొట్టుకుపోయాయని, వాటిని తేల్చడానికి శాస్త్రీయ పద్ధతుల్లో విచారణ చేపట్టాలనుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

శాస్త్రీయ అధ్యయనానికి సంబంధించి కొన్ని సంస్థలను సంప్రదించామని, అన్నీ అధ్యయనం చేసి శాస్త్రీయ ఆధారాలతో నివేదిక అందించడానికి మూడు నెలలు గడువు కావాలని ఏపీ ప్రభుత్వం కోర్టును కోరింది. అక్రమ తవ్వకాలకు బాధ్యులైన ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని సస్పెండ్‌ చేసిన విషయాన్ని ఏపీ ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది హుజేఫా అహ్మదీ కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు.

ఎనిమిది జిల్లాల్లో మాత్రమే ఇసుక అక్రమ తవ్వకాలపై అధ్యయనం చేశామని, మిగతా జిల్లాల్లో అధ్యయానికి మరింత సమయం కావాలని కేంద్ర కమిటీ కోరింది. తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసింది. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై గతంలో సుప్రీం సీరియస్ అయ్యింది. కేంద్ర కమిటీని నియమించింది. అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు జరిగినట్లు కేంద్ర కమిటీ నిర్ధారించింది.