SSC Exams | టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్.. పరీక్ష తేదీలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి (SSC) విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్సెస్సీ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది.
విధాత, అమరావతి :
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి (SSC) విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్సెస్సీ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ముగింపు సమయంలో నిర్వహించే ఈ కీలక పరీక్షలను ఈసారి మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలలో ఒకేసారి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరగనున్నాయి. విద్యార్థులకు సమాధానాలు రాయడానికి తగినంత సమయం లభించేలా ఈసారి అదనపు సమయాన్ని కల్పించినట్టు అధికారులు వెల్లడించారు. పరీక్షల తేదీలు ఇవే.. మార్చి 16 ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 20న ఇంగ్లీష్, మార్చి 23న మ్యాథమెటిక్స్, మార్చి 25న ఫిజికల్ సైన్స్, మార్చి 28న సోషల్ స్టడీస్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ప్రత్యేక పత్రాల పరీక్షలు.. మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–II (కంప్యూటర్ కోర్స్), oss మెయిన్ లాంగ్వేజ్ పేపర్–I (సంస్కృతం, అరబిక్, ఫెర్సియన్), ఏప్రిల్ 1 వ తేదీన OSS మెయిన్ లాంగ్వేజ్ పేపర్–II (సంస్కృతం, అరబిక్, ఫెర్సియన్) SSC వోకేషనల్ కోర్స్ థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram