రెండు రోజుల్లో మరో 300 పడకలు

విధాత‌(విశాఖపట్నం): కరోనావైరస్ సోకి, ఆక్సిజన్ స్థాయిలు పడిపోయిన వారికి అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు ఆక్సిజన్ సరఫరా సదుపాయం ఉన్న 300 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ షీలానగర్‌లో ఉన్న వికాస్ విద్యానికేతన్ ప్రాంగణంలో ఏర్పాటు కానున్న ఈ కోవిడ్ వైద్య సేవల కేంద్రం పనులను గురువారం విజయసాయి రెడ్డి పర్యవేక్షించారు. విజయసాయి రెడ్డితో […]

  • Publish Date - May 7, 2021 / 05:05 AM IST

విధాత‌(విశాఖపట్నం): కరోనావైరస్ సోకి, ఆక్సిజన్ స్థాయిలు పడిపోయిన వారికి అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు ఆక్సిజన్ సరఫరా సదుపాయం ఉన్న 300 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.

విశాఖ షీలానగర్‌లో ఉన్న వికాస్ విద్యానికేతన్ ప్రాంగణంలో ఏర్పాటు కానున్న ఈ కోవిడ్ వైద్య సేవల కేంద్రం పనులను గురువారం విజయసాయి రెడ్డి పర్యవేక్షించారు. విజయసాయి రెడ్డితో పాటు వికాస్ విద్యానికేతన్‌లో కోవిడ్ కేంద్రం ఏర్పాట్లను పర్యవేక్షించిన వారిలో ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సుధాకర్, డీఎంహెచ్ఓ పి సూర్యనారాయణ, జీవీఎంసీ ప్రాజెక్టు డైరెక్టర్ వై శ్రీనివాస్, ప్రగతి భారత్ ఫౌండేషన్ ప్రతినిధులు గోపినాధ్ రెడ్డి జాస్తి బాలాజీ తదితరులు ఉన్నారు.

Latest News