కేంద్ర జలశక్తి మంత్రిని కలసిన భాజపా బృందం

విధాత:కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు, సిఎం రమేష్, టిజే వెంకటేష్, పూర్వ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్రెడ్డి, అధికార ప్రతినిధి జి.భానుప్రకాశ్ రెడ్డి కలిశారు. పోలవరం ప్రాజెక్టు పర్యటన, పరిశీలించిన అంశాలు, పోలవరం నిర్వాసితులు, ముంపు గ్రామాల్లో నిర్వాసితుల తరలింపు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు మంత్రి దృష్టికి తెచ్చారు. ఆర్ ఆర్ […]

కేంద్ర జలశక్తి మంత్రిని కలసిన భాజపా బృందం

విధాత:కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు, సిఎం రమేష్, టిజే వెంకటేష్, పూర్వ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్రెడ్డి, అధికార ప్రతినిధి జి.భానుప్రకాశ్ రెడ్డి కలిశారు. పోలవరం ప్రాజెక్టు పర్యటన, పరిశీలించిన అంశాలు, పోలవరం నిర్వాసితులు, ముంపు గ్రామాల్లో నిర్వాసితుల తరలింపు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు మంత్రి దృష్టికి తెచ్చారు. ఆర్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఇప్పటివరకూ సాయం అందలేదని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న మేజర్, మైనర్ ప్రాజెక్టుల గురించి మంత్రితో చర్చించారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో చొరవచూపి ఆయా ప్రాంతానికి న్యాయం చేయాలని కోరారు. విజయవాడలో జరిగిన నీటి రంగ నిపుణులు రౌండ్ టేబుల్ సమావేశంలో ఇచ్చిన సలహాలు సూచనలు కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టులను పరిశీలనకు రావాలని గాను రాష్ట్రంలో పర్యటించాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. ఆయన సానుకూలంగా స్పందించారు.

కేంద్ర ఉక్కుశాఖ మంత్రికి వినతి

భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు ఆధ్వర్యంలో నేతల బృందం, ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖమంత్రి రాంచంద్రప్రసాద్ సింగ్ని కలసి విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ఎంతో కాలంగా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం చూపించి న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్ మాట్లాడుతూ 32మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని ఎన్ఎండీసీ లేదా సెయిల్లో విలీనంచేసి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగే విధంగా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. సెంటిమెంట్ తో కూడుకున్న విషయం కావడంతో ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. కేంద్ర మంత్రిని కలసిన బృందంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి, అధికార ప్రతినిధి జి.భానుప్రకాశ్ రెడ్డి తదితరులున్నారు. కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు, ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం అధ్యక్షులు పితాన భాస్కరరావు, సెక్రటరీ ఉమ్మడి అప్పారావు, నిర్వాసితు కాంట్రాక్టర్ లేబరు సంఘం అధ్యక్షులు గల్లా రామకృష్ణ, ఉ పాద్యక్షురాలు ధనలక్ష్మీ, నాయకులు గొంతిన నరసింగరావు, అండిబోయిన శ్రీనివాసరావు, గాజువాక భాజపా నాయకులు బొండా యల్లాజీ రావు, వెన్నా శ్రీరాంమూర్తి, కిలాన. ముసలయ్య, పుష్పలత తదితరులున్నారు