Chandrababu Urea Reduction Scheme| యూరియ వాడకం తగ్గిస్తే..బస్తాకు రూ.800ఇస్తాం : చంద్రబాబు కీలక ప్రకటన
రసాయన యూరియా వాడకం తగ్గించిన రైతులకు బస్తాకు రూ.800ప్రోత్సాహకంగా అందిస్తామని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. రైతులు వచ్చే ఏడాది నుండి యూరియా తగ్గిస్తే.. ఆ మేరకు ప్రోత్సాహము ఇస్తామన్నారు.

అమరావతి : రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత(Urea Shortage) సమస్య పరిష్కారం దిశగా ఏపీ సీఎం చంద్రబాబు(AP CMChandrababu Naidu) కీలక ప్రకటన(Announced )చేశారు. రసాయన యూరియా(Urea) reduction వాడకం తగ్గించిన రైతులకు బస్తాకు రూ.800ప్రోత్సాహకంగా( Rs 800 per bag urea reduction incentive)అందిస్తామని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. రైతులు వచ్చే ఏడాది నుండి యూరియా తగ్గిస్తే.. ఆ మేరకు ప్రోత్సాహము(incentive) ఇస్తామన్నారు. ప్రస్తుతం వాడుతున్న యూరియాను తగ్గించే క్రమంలో.. ప్రతి బస్తాకు రూ. 800 నేరుగా రైతుకు అందిస్తామని కొత్త పథకాన్ని ప్రకటించారు.
రసాయన ఎరువుల వినియోగం నియంత్రించే దిశగా సీఎం చంద్రబాబు ప్రకటించిన ఈ నగదు ప్రోత్సాహక పథకం దేశంలో ఎక్కడా లేకపోవడం విశేషం. ఓ రైతు ప్రస్తుతం వాడుతున్న యూరియాకు..వచ్చే ఏడాది ఎన్ని బస్తాలు తగ్గిస్తే అంతమేరకు బస్తాకు రూ.800నగదు దక్కనుంది. ఇది వ్యవసాయ రంగంతో రసాయనిక ఎరువుల నియంత్రణకు..సేంద్రీయ ఎరువుల పెంపుతో పాటు అంతర్జాతీయంగా దేశానికి యూరియా దిగుమతి తిప్పలు తగ్గి…ఆ మేరకు విదేశీ మారక ద్రవ్యం..సబ్సీడీల భారం తగ్గనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
యూరియా అధిక వినియోగంతో పెరుగుతున్న క్యాన్సర్ : చంద్రబాబు
కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు యూరియా వాడకంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడారు. రైతు నష్టపోకూడదు, ప్రజారోగ్యం బాగుండాలని పేర్కొన్నారు. యూరియా ఎక్కువ వాడితే ఎక్కువ పంట వస్తుందనుకోవడం సరికాదన్నారు. యూరియా అతివాడకంపై పంజాబ్‌ను కేస్ స్టడీగా చూడాలిఅని చంద్రబాబు తెలిపారు. మన రైతులు యూరియా ఎక్కువగా వాడుతున్నారని.. దీనివల్ల మిరపను చైనా నుండి తిప్పి పంపారని గుర్తు చేశారు. అలాగే కొన్ని యూరప్ దేశాలు మన ఉత్పత్తుల ధరలు తగ్గిస్తున్నాయని వెల్లడించారు.
యూరియా ఎక్కువ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందని… యూరియా వాడకంపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. దేశంలో క్యాన్సర్ టాప్-5 రాష్ట్రాల జాబితాలో ఏపీ ఉందని..రసాయనిక ఎరువుల వాడకం ఇలాగే కొనసాగితే టాప్ 1కు కూడా చేరుకుంటామని హెచ్చరించారు. వచ్చే ఏడాది నుంచి యూరియ, ఇతర రసాయానికి ఎరువులు ఎంతవరకు అవసరమో అంతే వినియోగించాలి. మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ కింద ఇవ్వాలని సూచించారు.