CM Chandrababu | రెండు, మూడు షాపులు తిరిగి.. భార్య కోసం రెండు చీర‌లు కొన్న సీఎం చంద్ర‌బాబు.. వీడియో

CM Chandrababu | ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు( Chandrababu ).. త‌న భార్య భువ‌నేశ్వ‌రి( Bhuvaneshwari ) కోసం ఏరికోరి రెండు చీర‌లు( Sarees ) కొన్నారు. అది కూడా రెండు, మూడు షాపులు తిరిగి చివ‌ర‌కు రెండు చీర‌ల‌ను సెలెక్ట్ చేసుకున్నారు సీఎం చంద్ర‌బాబు. సీఎం కొనుగోలు చేసిన చీర‌ల్లో ఒక‌టి వెంక‌ట‌గిరి చీర( Venkatagiri Saree ) కాగా, మరొక‌టి ఉప్పాడ జాందాని చీర‌( Uppada Jamdani Saree ).

CM Chandrababu | రెండు, మూడు షాపులు తిరిగి.. భార్య కోసం రెండు చీర‌లు కొన్న సీఎం చంద్ర‌బాబు.. వీడియో

CM Chandrababu | ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు( Chandrababu ).. త‌న భార్య భువ‌నేశ్వ‌రి( Bhuvaneshwari ) కోసం ఏరికోరి రెండు చీర‌లు( Sarees ) కొన్నారు. అది కూడా రెండు, మూడు షాపులు తిరిగి చివ‌ర‌కు రెండు చీర‌ల‌ను సెలెక్ట్ చేసుకున్నారు సీఎం చంద్ర‌బాబు. జాతీయ చేనేత దినోత్స‌వం( National Handloom Day ) సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌( Vijayawada )లో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్స్‌( Chenetha Stalls )ను సీఎం చంద్ర‌బాబు బుధ‌వారం ప‌రిశీలించారు. స్టాళ్ల‌ను సంద‌ర్శిస్తున్న స‌మ‌యంలో రెండు, మూడు షాపుల్లో త‌న‌కు న‌చ్చిన ఓ రెండు చీర‌ల‌ను త‌న భార్య భువ‌నేశ్వ‌రి కోసం చంద్ర‌బాబు కొనుగోలు చేశారు.

చంద్ర‌బాబు కొనుగోలు చేసిన చీర‌ల్లో ఒక‌టి వెంక‌ట‌గిరి చీర( Venkatagiri Saree ) కాగా, మరొక‌టి ఉప్పాడ జాందాని చీర‌( Uppada Jamdani Saree ). ఇక ఈ చీర‌ల డ‌బ్బుల‌ను వెంబ‌డే స్టాళ్ల నిర్వాహ‌కుల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అంద‌జేశారు. చేనేత చీర‌ల ప్ర‌త్యేక‌త‌ను కూడా చంద్ర‌బాబు అడిగి తెలుసుకున్నారు. చీర‌లు కొన‌డం త‌న‌కు అల‌వాటు లేకున్నా.. నేత‌న్న‌ల‌ను ఎంక‌రేజ్ చేసేందుకు త‌న స‌తీమ‌ణి కోసం రెండు చీర‌ల‌ను కొనుగోలు చేసిన‌ట్లు చంద్ర‌బాబు పేర్కొన్నారు.

చేనేత కార్మికుల‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో చీరకు ముడి సరకుకు అయ్యే ఖర్చును, అది అమ్మే ధరను తెలుసుకున్నారు. జీఎస్టీ వల్ల చీర ధర ఎక్కువ అవుతుందని వారు చంద్రబాబుకు వివరించారు. చేనేత కార్మికులకు జీఎస్టీ తొలగించేందుకు ప్రయత్నిస్తామని.. జీఎస్టీ తొలగించని పక్షంలో రీఎంబర్స్‌ చేస్తామని అన్నారు. ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరించాలని.. చేనేత పరిశ్రమను కాపాడటం మన బాధ్యత అని చంద్రబాబు చెప్పారు. నెలకు ఒకరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు. కార్మికులకు చేనేత మగ్గాల కోసం రూ.50 వేలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.