Srisailam Project Gates Lifted| శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత..సీఎం చంద్రబాబు పూజలు
అమరావతి : ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువైన శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం గేట్లను మంగళవారం మధ్యాహ్నం ఎత్తి దిగువకు నీటీ విడుదల ప్రారంభించారు. నాలుగు గేట్లను ఎత్తి దిగువన నాగార్జు సాగర్ కు నీటీని విడుదల చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ముందుగా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఆయనకు ఆలయ అధికారులు, పండితులు స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్ధకు చేరుకుని డ్యామ్ వద్ధ ప్రత్యేక పూజలు నిర్వహించి..కృష్ణమ్మకు చీరసారే సమర్పించి గంగా హారతి ఇచ్చారు. అనంతరం డ్యామ్ క్రస్ట్ గేట్లను బటన్ నొక్కి ఎత్తారు. 6, 7, 8, 11 నాలుగు గేట్ల ద్వారా నాగార్జున సాగర్ కి నీరు విడుదల చేస్తున్నారు.
దీంతో శ్రీశైలం మల్లన్న సన్నిధి నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ కు పరవళ్లు తొక్కుతుంది. శ్రీశైలం డ్యామ్ గేట్ల నుంచి పాలనురుగలను తలపించేలా దిగువకు పోటెత్తుతున్న కృష్ణమ్మ జలసోయగాల పరవళ్లు చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో శ్రీశైలం చేరుతున్నారు. 25 ఏళ్ల తర్వాత జులై మొదటి వారంలోనే తెరుచుకున్న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవడం విశేషం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram