Pawan Kalyan : ఎర్రచందనం చెట్లను కాపాడుకోవాలి

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చెట్ల సంరక్షణకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామన్నారు.

Pawan Kalyan : ఎర్రచందనం చెట్లను కాపాడుకోవాలి

ఎర్రచందనం చెట్లను కాపాడుకోవాలి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎర్ర చందనం స్మగ్లింగ్ నిర్మూలనకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అడవిలోని ప్రతి చెట్టును పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలం అడవిలో కనిపించే అరుదైన మొక్కలు పరిశీలించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు.

ఎర్రచందనం స్మగ్లింగ్, స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర అంశాలపై డిప్యూటీ సీఎం అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నేపాల్ లో కూడా మన ఎర్ర చందనం పట్టుబడిందని గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలో ఎర్రచందనం పట్టుబడినా మనకు అప్పగించేలా ఒప్పందం చేసుకుంటున్నాం అని ఆయన తెలిపారు. గత ఐదేళ్లలో విపరీతంగా ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరిగిందని విమర్శించారు. ఐదేళ్లలో లక్షా 30 వేల ఎర్రచందనం చెట్లను నరికేశారని డిప్యూటీ సీఎం పవన్‌ వెల్లడించారు.