TTD Parakamani Case : టీటీడీ పరకామణి చోరీ కేసు సీబీసీఐడీకి : ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
టీటీడీ పరకామణి చోరీ కేసుపై హైకోర్టు సంచలన ఆదేశాలు..! ఏం చెప్పింది కోర్టు? కేసు సీబీసీఐడీకి ఎందుకు అప్పగించిందో తెలుసుకోండి.
అమరావతి : టీటీడీ పరకామణి చోరీ కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 2 నాటికి కేసు విచారణ పూర్తి చేయాలని న్యాయస్థానం పేర్కొంది. నిందితుడు రవికుమార్, అతని కుటంబం ఆస్తులు, బ్యాంకు లావాదేవిలపై దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీకి కోర్టు ఆదేశాలిచ్చింది. ఆస్తులు బదలాయించారా అనే అంశంపైనా దర్యాప్తు చేయాలని ఆదేశించింది.
లోక్ అదాలత్‌లో రాజీ కుదిర్చిన న్యాయమూర్తిపైన, గత టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపైన, అధికారులపైన లోతుగా విచారణ చేయాలని హైకోర్టు సూచించింది. విచారణ నివేదికను తదుపరి విచారణలోగా అందించాలని సీఐడీ, ఏసీబీలకు హైకోర్టు నిర్దేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 2కి వాయిదా వేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram