హిడ్మా, మిగతా నాయకుల ఎన్ కౌంటర్ బూటకం: పౌర హక్కుల సంఘం

మావోయిస్ట్ అగ్రనాయకుడు హిడ్మా, మిగతా నాయకుల ఎన్ కౌంటర్ బూటకమని, పోలీసులు వారిని పట్టుకొని కాల్చి చంపారని ఏపీ పౌర హక్కుల సంఘం ఏపీ అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ వెల్లడించారు.

హిడ్మా, మిగతా నాయకుల ఎన్ కౌంటర్ బూటకం: పౌర హక్కుల సంఘం

విధాత: మావోయిస్ట్ అగ్రనాయకుడు హిడ్మా, మిగతా నాయకుల ఎన్ కౌంటర్ బూటకమని, పోలీసులు వారిని పట్టుకొని కాల్చి చంపారని ఏపీ పౌర హక్కుల సంఘం ఏపీ అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గత నెల 28వ తేదీన ఆంధ్ర ప్రదేశ్‌లోని ఓ షెల్టర్‌లో ఉన్న హిడ్మాను అతని సహచరులను ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఏపీ పోలీసులు పట్టుకున్నారని, తాజాగా మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకెళ్ళి నిరాయుధుల్ని చేసి అతి కిరాతకంగా హత్యచేశారన్నారు.

ఈ బూటకపు ఎన్కౌంటర్ ను పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. మరింత మంది నిరాయుధుల్ని హత్యచేసే అవకాశం ఉంది, వెంటనే వారిని కోర్టులో ప్రవేశపెట్టాలని, ఈ హత్యలను ఆపివేసి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీ చే న్యాయవిచారణ జరిపించాల్సిందిగా పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నదని తెలిపారు. ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులు అందరూ ఈ క్రూరమైన హత్యాకాండలను ఖండించాలని పిలిపునిచ్చారు.