విధాత: పెనుకొండ పరిధిలోని ఎర్రమంచి వద్దనున్న కియా కార్ల పరిశ్రమను రాష్ట్ర ఏపీఐఐసీ ఛైర్మెన్ మెట్టు గోవిందరెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కియా ఇండియాలో ప్రెస్ షాప్, బాడీ షాప్, పెయింట్ షాప్ తదితర విభాగాలను ఆయన పరిశీలించారు. అంతకుముందు కియా కంపెనీ ప్రతినిధులు కియా ఇండియాలో కంపెనీ సేల్స్ వివరాలు, ఫ్యాక్టరీ నిర్మాణం, ట్రైనింగ్ సెంటర్ల వివరాలు, కియా కంపెనీ తరఫున ఈ ప్రాంతంలో చేస్తున్న సామాజిక కార్యక్రమాలు, కల్పిస్తున్న సదుపాయాలు, వసతులు తదితర వివరాలను తెలియజేశారు. అనంతరం ఏపీఐఐసీ ఛైర్మెన్ కియా ఇండియా శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీఐఐసీ ఛైర్మెన్, ఏపీఐఐసీ ఈడి సుదర్శన్ బాబు కియా, అమ్మవారిపల్లి, గుడిపల్లి పరిశ్రమల యాజమాన్యాలతో పరస్పర అవగాహన సదస్సులో పాల్గొని వివిధ అంశములను చర్చించారు. అలాగే వరల్డ్ క్లాస్ ఆటోమొబైల్ క్లస్టర్ కు సంబంధించి ఎకో సిస్టమ్ అభివృద్ధికి తోడ్పడు అంశములను వారు చర్చించారు.
ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ పద్మావతి, కియా ఇండియా ఎండి కుక్ హ్యూన్ షిమ్, కియా ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ (సిఏఓ) కబ్ డంగ్ లీ, లీగల్ డిపార్ట్మెంట్ హెడ్ జూడ్ లీ, ప్రిన్సిపల్ అడ్వైజర్ డా. సోమశేఖర్ రెడ్డి, జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్ ) నాగభూషణం, మేనేజర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
కియా ఇండియాను సందర్శించిన ఏపీఐఐసీ ఛైర్మెన్ మెట్టు గోవిందరెడ్డి
<p>విధాత: పెనుకొండ పరిధిలోని ఎర్రమంచి వద్దనున్న కియా కార్ల పరిశ్రమను రాష్ట్ర ఏపీఐఐసీ ఛైర్మెన్ మెట్టు గోవిందరెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కియా ఇండియాలో ప్రెస్ షాప్, బాడీ షాప్, పెయింట్ షాప్ తదితర విభాగాలను ఆయన పరిశీలించారు. అంతకుముందు కియా కంపెనీ ప్రతినిధులు కియా ఇండియాలో కంపెనీ సేల్స్ వివరాలు, ఫ్యాక్టరీ నిర్మాణం, ట్రైనింగ్ సెంటర్ల వివరాలు, కియా కంపెనీ తరఫున ఈ ప్రాంతంలో చేస్తున్న సామాజిక కార్యక్రమాలు, కల్పిస్తున్న సదుపాయాలు, వసతులు తదితర […]</p>
Latest News

మెట్రో విస్తరణకు అడ్డంకి కిషన్ రెడ్డినే : సీఎం రేవంత్ రెడ్డి
అమెరికాలో విమాన ప్రమాదం.. 12 మంది దుర్మరణం
షోరూం ముందే ఆగిపోయిన రూ.25 లక్షల కారు
సింగరేణి రూ.1,600కోట్ల బంగారం ఏమైనట్లు..?
కాక్రోచ్ పార్టీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ లో మళ్లీ సర్కారీ భూముల వేలం..!
ఆ ధాన్యం పండించకండి..మేం కొనం: రైస్ మిల్లర్స్
పైపైకి.. బంగారం, వెండి ధరలు
సర్ భయంతో నేలకు దిగివస్తున్న ప్రధాన పార్టీల నేతలు
వైరల్..చేతులపై నుంచి 100 కార్లు..శరీరంపై నుంచి 100 బైక్ లు !