అమరావతి : ఏపీ రాజధాని అమరావతి పరిధిలో బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం శంకుస్థాపన చేశారు. రూ.750 కోట్లతో తుళ్లూరు సమీపంలో ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు.
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఇక్కడ ఏపీ సర్కార్ 21 ఎకరాల భూమిని కేటాయించింది. మొదటి దశలో 500 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు.
ఈసందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకొని ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. అమరావతిలో క్యాన్సర్ ఆస్పత్రి సేవల కోసం అందరూ ఎదురు చూస్తున్నారన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో లేటెస్ట్ ఎక్విప్‌మెంట్‌తో ఇక్కడ ఆస్పత్రి ఏర్పాటుచేస్తున్నాం అని వెల్లడించారు. హైదరాబాద్ బసవతారకం ఆస్పత్రి స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో జూన్ 22న భారీ కార్యక్రమం ఏర్పాటుచేయబోతున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ఆహ్వానించనున్నట్లుగా బాలకృష్ణ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
ఏడేళ్ల బాలుడి సాహసం..పాల్క్ జలసంధి ఈదడంలో కొత్త రికార్డు
మెట్రో స్వాధీనానికి కేంద్రం బ్రేక్.. ప్రత్యామ్నాయంగా RRTS మోడల్ సూచన!
