Site icon vidhaatha

ఏపీ ఎన్జీఓ సంఘ నూతన అధ్యక్షుడిగా బండి శ్రీనివాసరావు

మా మీద నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతను శిరసా వహిస్తాం.27% ఐఆర్ ను పెంచి కొత్త ఏఆర్సీ అమలులోకి తెచ్చేందుకు కృషి చేస్తాం.సీఎం జగన్ కూడా ఐఆర్ పెంపుకు హామీ ఇచ్చారు.మూడు డీఏలను కేంద్రం పెండింగ్ లో పెట్టాం అన్నారు.కొంతమంది అధికారుల జాప్యంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది.పాదయాత్రలో డిమాండ్లపై కమిటీలతో కాలయాపన చేయకుండా పూర్తి చేయాలి.మాస్కులు, శానిటైజర్లు లేక డాక్టర్లు, మెడికల్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.జీఓ 64 అనే మహమ్మారిని తీసుకొచ్చారు కాటంనేని భాస్కర్.తక్షణమే జీఓ 64 రద్దు చేయకపోతే ఉద్యమిస్తాం.జీఎస్టీ అధికారులకు అందరికీ గజిటెడ్ స్ధాయి కల్పించాలి.ఏపీ ఎన్జీఓ నూతన ప్రధాన కార్యదర్శి, కె.వి.శివారెడ్డి.సమస్యలు తీరాలని సంఘం ఎన్నో పోరాటాలు చేస్తోంది.డిమాండ్లు సాధించడానికి కచ్చితంగా ఉద్యమిస్తాం.

సముద్రంలాంటి సంఘం లో నుంచీ చిన్న పాయలు పక్కకి పోతే పోయిందేమీ లేదు.కోవిడ్ తీవ్రత తగ్గాక అందరం కలిసి ఉద్యమిస్తాం.ఆ పరిస్ధితి రాకుండా ప్రభుత్వం చూస్తుందని ఆశిస్తున్నాం.ఐఏఎస్ లు టెక్నికల్ విషయాలు తెలీకుండా జీఓ 64 తెచ్చారు.డిపార్ట్మెంట్ హెష్ఓడీ లకు మాత్రమే అవగాహన ఉండే సీఆర్ ను వారే ఇచ్చేలా చూడాలి.కోవిడ్ కాలంలో ఎంతో వీరోచితమైన సేవ చేస్తున్నారు వైద్య ఉద్యోగులు.వైద్యులతో కలిసి ఉద్యమించడానికి ఏపీఎన్జీఓ సిద్ధం.

Exit mobile version